ఎట్టకేలకు బ్రేకప్‌ వార్తలపై స్పందించిన కియారా అద్వానీ.. వదిలే ప్రసక్తే లేదంటూ కామెంట్‌.. ఫ్యాన్స్ ఖుషీ

Published : Apr 28, 2022, 07:47 AM IST

మహేష్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ తన లవ్‌ బ్రేకప్‌ వార్తలపై స్పందించింది. ముంబయిలోని ఓ ఈవెంట్‌లో ఆమె దీనిపై రియాక్ట్ అవుతూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ కామెంట్‌ చేసింది. ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది. 

PREV
16
ఎట్టకేలకు బ్రేకప్‌ వార్తలపై స్పందించిన కియారా అద్వానీ.. వదిలే ప్రసక్తే లేదంటూ కామెంట్‌.. ఫ్యాన్స్ ఖుషీ

మహేష్‌తో `భరత్‌ అనే నేను`, రామ్‌చరణ్‌తో `వినయ విధేయ రామ` చిత్రాలు చేసి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది కియారా అద్వానీ(Kiara Advani). ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయిన ఈ భామ గతేడాది నుంచి బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా(Sidharth Malhotra)తో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు ప్రచారమవుతున్నాయి. వీరిద్దరు కలిసి `షేర్షా` చిత్రంలో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్‌. 

26

చాలా సందర్భంలో వీరిద్దరు డేటింగ్‌కి వెళ్లారని, సీక్రెట్‌గా(Kiara Sidharth love) కలిసి తిరుగుతున్నారని బాలీవుడ్‌ మీడియా రాసుకొస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఈ ఇద్దరు ఎక్కడ కలిసినా చాలా క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నారు. అంతేకాదు వెకేషన్‌కి కూడా ఇద్దరు కలిసే వెళ్లడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే ఇటీవల వీరి బ్రేకప్‌ చెప్పుకున్నారనే వార్త దుమారం రేపింది. బాలీవుడ్‌లో ఈ జోడీ బ్రేకప్‌(Love Breakup) వార్తలు ఊపందుకున్నాయి. 
 

36

ప్రస్తుతం సిద్ధార్థ్‌, కియారా దూరంగా ఉంటున్నారని, అందుకే బ్రేకపే కారణమంటున్నారు. ఈనేపథ్యంలో తాజాగా కియారా అద్వానీ దీనిపై స్పందించింది. ఆమె ప్రస్తుతం `భూల్‌ భులయ్యా 2` చిత్రంలో నటించింది. సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్ర ట్రైలర్‌ ఈవెంట్‌లో కియారా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెకి ఈ ప్రశ్న ఎదురైంది. 

46

`మీరు ఎవరినైనా మర్చిపోవాలనుకుంటున్నా?` అనే ప్రశ్న విలేకరి నుంచి ఎదురు కావడంతో ఎట్టకేలకు కియారా అద్వానీ నోరు విప్పింది. దీనిపై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది. `నా  జీవితంలో నేను ఇప్పటి వరకు కలిసిన ప్రతి ఒక్కరూ నాకు ముఖ్యమే. ఎవరినీ మర్చిపోవాల్సిన అవసరం లేదు. అందరూ నాకు ముఖ్యమే` అని చెప్పింది. దీంతో సిద్ధార్థ్‌తో బ్రేకప్‌ వార్తల్లో నిజం లేదని, కియారా ఈ విషయాన్ని తెలివిగా వెల్లడించిందని అంటున్నారు. 

56

అయితే వీరిద్దరు తమ సినిమాల షూటింగ్‌ల బిజీలో ఉండటం వల్ల కలవడానికి కుదరడం లేదని, అంతేకానీ ఎలాంటి గొడవలు లేవని వారి సన్నిహితులు చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే సిద్ధార్థ్‌, కియారాలు తాము రిలేషన్‌లో ఉన్నామనే విషయాన్ని కూడా చెప్పలేదు. కానీ ముంబయి రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. పార్టీలు,పబ్‌ల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా ఇంటికి కియారా వెళుతూ మీడియాకి చిక్కింది. మరి తమ సీక్రెట్‌ లవ్‌ని ఎప్పుడు బహిర్గతం చేస్తారో చూడాలి. 
 

66

`భూల్ భూలయ్యా 2` చిత్రంలో కియారా, కార్తీక్‌ ఆర్యన్‌కు జోడిగా నటిస్తోంది. నటి టబు కీ రోల్‌ పోషిస్తోంది. దీంతోపాటు `గోవింద నామ్‌ మేరా`, `జగ్‌ జుగ్‌ జీయో` అలాగే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ రామ్‌చరణ్‌తో శంకర్‌(ఆర్‌సీ 15) సినిమాలో నటిస్తుంది. మరోవైపు సిద్ధార్థ్‌ మల్హోత్రా సైతం ఫుల్‌ బిజీగాఉన్నారు. ఆయన `మిషన్‌ మజ్ను`, `థ్యాంక్‌ గాడ్‌`, `యోధ` చిత్రాలు చేస్తున్నారు. `మిషన్‌ మజ్ను`లో రష్మిక మందన్నా కథానాయిక. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories