రెడ్ అవుట్ ఫిట్ లో శ్రీనిధి స్టన్నింగ్ స్టిల్స్.. హాఫ్ షోల్డర్ డ్రెస్ లో ‘కేజీఎఫ్’ భామ గ్లామర్ విందు!

First Published | Jan 19, 2023, 2:21 PM IST

తొలిచిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. నెమ్మదిగా గ్లామర్ మెరుపులతో అభిమానులతో పాటు నెటిజన్లను మైమరిపిస్తోంది. 
 

శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన తొలిచిత్రం ‘కేజీఎఫ్’. కన్నడ పరిశ్రమ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందీ సినిమా. యష్ ప్రధాన పాత్రలో నటించగా.. కథానాయికగా శ్రీనిధి అలరించింది. 
 

‘కేజీఎఫ్’,‘కేజీఎఫ్2’లో శ్రీనిధి తన అగ్రెసివ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఈ చిత్రం పాన్ ఇండియన్ ఫిల్మ్ గా విడుదలవడంతో శ్రీనిధికి దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కింది. అదే ఊపులో ఇండస్ట్రీ నుంచి వరుస ఆఫర్లు అందాయి.  


చివరిగా ‘కోబ్రా’లో తమిళ స్టార్ విక్రమ్ సరసన ఆడిపాడింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. దీంతో శ్రీనిధికి కాస్తా ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఫలితంగా అవకాశాల విషయంలో కాస్తా ఇబ్బందులు తప్పేట్టుగా కనిపించడం లేదు.

కేజీఎఫ్ సక్సెస్ తో ఏకంగా రెమ్యూనరేషన్ కూడా పెంచిన ఈ ముద్దుగుమ్మ ‘కోబ్రా’ ఇచ్చిన ఫలితంతో వెనక్కు తగ్గే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో అప్డేట్ అందడం లేదు. 

మరోవైపు అవకాశాలను అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకోసం సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. అప్పట్లో నెట్టింట కాస్తా పద్దతిగా మెరిసే ఈ బ్యూటీ.. ప్రస్తుతం రూటు మార్చి గ్లామర్ విందు చేస్తోంది. 

తాజాగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. రెడ్ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. హాఫ్ షోల్డర్ డ్రెస్ లో టాప్ గ్లామర్ షోతో మతులు పోగొట్టింది. యంగ్ బ్యూటీ పరువాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.  

Latest Videos

click me!