సోఫాపై పడుకొని కేతికా శర్మ కవ్వింపు పోజులు.. ఆ మత్తు కళ్లలోకి చూశారో అంతే.. స్టన్నింగ్ పిక్స్!

First Published | Feb 16, 2023, 2:32 PM IST

యంగ్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) సోషల్ మీడియాలను షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లనే ఆశ్చర్యపరిచేలా స్టిల్స్ ఇస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. 
 

‘రొమాంటిక్’ చిత్రంతో యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ కేతికా శర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తొలిచిత్రంతోనే యూత్ పై తన గ్లామర్ వలను విసిరారు. బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ రెచ్చిపోయింది. వెండితెరపై పరువాల ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
 

కేతికా నటనతో పాటు గ్లామర్ పరంగానూ అలరించేందుకు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ కారణంగానే ‘లక్ష్య’,‘రంగ రంగ వైభవంగా’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ సరసన నటించింది. ఈ చిత్రంలో కాస్తా పద్ధతిగా మెరిసింది. 
 


తను నటించిన మూడు చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. అంతంత మాత్రన ఆడి థియేటర్ల నుంచి వెళ్లిపోయాయి. దీంతో కేతికాకు ఆశించిన మేర క్రేజ్ దక్కడం లేదు. దీంతో ఈ బ్యూటీ  సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. 

ఈ సందర్బంగా వరుసగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఏకంగా హాట్ హాట్ ఫొటోషూట్లు చేస్తూ.. అందాలను ప్రదర్శిస్తూ కుర్రగుండెల్ని కొల్లగొడుతోంది. మత్తుచూపులు.. మైమరిపించే అందాల వలలో కుర్రాళ్ల చూపులను బంధిస్తోంది. 
 

లేటెస్ట్ గా కేతికా ఇండోర్ షూట్ స్టన్నింగ్ గా ఉంది. సోఫాపై యంగ్ బ్యూటీ పరువాల విందు చేసింది. బోర్లా పడుకొని మత్తు చూపులను విసిరింది. ఎల్లో స్లీవ్ లెస్ క్రాప్డ్ టాప్ లో ఎద అందాలను చూపిస్తూ మతులు పోగొట్టింది. కవ్వించే పోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  

స్టార్ హీరోయిన్లకే మతులుపోయేలా ఫొటోషూట్లు చేస్తున్న కేతికా చేతిలో ఎలాంటి ఆఫర్లు లేవు. దీంతో దర్శకనిర్మాతల కంట్లో పడేందుకు ఈ బ్యూటీ.. ఇలా స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తున్నట్టు కనిపిస్తోంది. చూడాలి మరీ కుర్ర భామ మున్ముందు ఎలాంటి  చిత్రాల్లో కనిపించబోతుందన్నది.  

Latest Videos

click me!