శరీరాన్ని కష్టపెట్టకూడదు..వర్కౌట్‌ని ఆస్వాధించాలిః కత్రీనా ఫిట్‌నెస్‌ టిప్స్

First Published Sep 22, 2020, 8:00 AM IST

బాలీవుడ్‌ గ్లామర్‌ డాల్‌ కత్రినా కైఫ్‌ ఫిట్‌నెస్‌ టిప్స్ చెబుతోంది. అదిరిపోయే ఫిజిక్‌తో ఆడియెన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసే కత్రినా మూడు పదుల వయసు దాటినా తరగని అందంతో మెస్మరైజ్‌ చేస్తూనే ఉంది. 
 

కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకేలా తన ఫిట్‌గా ఉన్న కత్రినా ప్రస్తుతం ఫిట్‌గా ఉండాలంటే ఏం చేయాలనేది చెబుతోంది. ఫిట్‌నెస్‌ పేరుతో శరీరాన్ని కష్టపెడకూడదని తెలిపింది.
undefined
ఫిట్‌నెస్‌ అనేది శారీరక, మానసిక ప్రయాణం. దాని కోసం చేసే వర్కౌట్స్ ని ఆనందంగా చేయాలి కానీ ఏదో సాధించాలనే తాపత్రయంతో శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదని తెలిపింది.
undefined
ఫిట్‌నెస్‌లో కీలకమైనది బ్యాలెన్స్. విపరీతమైన వర్కౌట్‌ చేస్తే అది శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంది. ఫిట్‌నెస్‌ ఓ పద్ధతిగా చేయాలి. అతి వ్యాయమాలు చేయకూడదని తెలిపింది.
undefined
మనం ఏం చేసినా దాన్ని ఆస్వాధించాలని, బలవంతంగా చేయకూడదని చెప్పింది. ఇష్టంతో చేస్తే ప్రతి మూవ్‌మెంట్‌ని ఆస్వాధించగలమని, ప్రతి రోజూ వ్యాయామం చేయాలని పేర్కొంది.
undefined
సినీ తారలు, క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలని, మనకెందుకులే అని చాలా మంది అనుకుంటారు. వృత్తికి, ఫిట్‌నెస్‌కి సంబంధం లేదు. అది మన ఆరోగ్యానికి సంబంధించినది, మానసిక స్థితికి సంబంధించినదని పేర్కొంది.
undefined
ప్రస్తుతం కత్రినా కైఫ్‌ `సూర్యవంశీ` చిత్రంలో అక్షయ్‌ కుమార్‌కి జోడీగా నటిస్తుంది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
click me!