ఆ డైరక్టర్ 'కమిట్ మెంట్' అడిగితే కాదన్నానని దారుణంగా నన్ను : కస్తూరి

First Published | Sep 14, 2024, 9:29 AM IST

 తన రెండో సినిమాలోనే దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగారని చెప్పడం తీవ్ర సంచలనం రేపింది.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న నటి కస్తూరి.  ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తున్న ఆమె ముక్కు సూటిగా మాట్లాడుతూంటుంది. తన మనస్సులో ఉన్న అభిప్రాయాలు చెప్పటానికి ఎప్పుడూ వెనకాడదు. ఎలాంటి  పరిణామాలకు అయినా సిద్దమే అంటుంది.

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు

kasthuri

ఇక ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది నటీమణులు తమ చేదు అనుభవాలు చెప్తున్నారు. ఈ నేపధ్యంలో  అలాంటి ఘటనే తన లైఫ్‌లో కూడా చోటుచేసుకుందని ఓ ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కస్తూరి ఎమోషనల్ అయింది.
  
కేరళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక తీవ్ర సంచలనం సృష్టిస్తున్న నేపధ్యంలో అనేక మంది హీరోయిన్‌లు ఇండస్ట్రీలో గతంలో వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపులను, చేదు అనుభవాలను మీడియా ముందు బహిర్గతం చేస్తూ వస్తున్నారు.


నెట్టింట యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే పలు ఇంటర్వ్యూలతోనూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ హాట్ టాపిక్ గ్గా మారుతుంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో కస్తూరి జీవితంలో జరిగిన చేధు అనుభవాన్ని బయటపెట్టింది. 

తాజాగా నటి కస్తూరి కూడా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వెల్లడించారు. తన రెండో సినిమాలోనే దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగారని చెప్పడం తీవ్ర సంచలనం రేపింది.

ఇలాంటి ఘటనే సీనియర్‌ నటి కస్తూరి జీవితంలో జరిగిందని తెలిపింది.   కస్తూరి మాట్లాడుతూ ... తాను నటించిన రెండో సినిమా దర్శకుడు తనతో అనుచితంగా మాట్లాడి కమిట్‌మెంట్ కావాలని, అడ్జస్ట్‌మెంట్ చేసుకోమని అడిగాడని చెప్పింది. అతని ఉద్దేశం అర్దమై షూటింగ్ స్పాట్ లోనే అందరి ముందు తిట్టానని చెప్పింది.
 

ఆ డైరక్టర్ కు  తాను అతనికి సహకరించలేదు కాబట్టి సినిమా మొదటి దశ పూర్తయిన తర్వాత కూడా తనను సినిమా నుండి తప్పించారని వెల్లడించింది.

ఫస్ట్ ఫేజ్ షూటింగ్ అయ్యాక తాను సన్నగా ఉన్నానన్న కారణంతో తప్పించారని చెప్పింది. అయితే ఆ డైరక్టర్ తనని ఆడిషన్ చేసే తీసుకున్నారని అప్పుడు అతనికి తెలియదా తను సన్నగా ఉన్నానని అంటూ నిలదీసింది. 

తాను ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని, తన తల్లి న్యాయవాది.. తనకే చిత్ర పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగాయని తెలిపింది.  సినిమాలపై ఆధారపడి జీవనోపాధి కోసం కొందరు మహిళలు ఇక్కడికి వస్తుంటారని, అలాంటి వారు అమ్మాయిలను ఎలా తయారు చేస్తారో ఆలోచించుకోవాలని అన్నారు. కావున సినిమాల్లోకి రావాలనుకున్న అమ్మాయిలు ధైర్యంగా, చాలా జాగ్రత్తగా ఉండాలని కస్తూరి సూచించారు. 

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ  సినిమాలలో టాప్  హీరోయిన్ గా వెలుగు వెలిగింది సీనియర్ హీరోయిన్ కస్తూరి (Kasthuri) . ఈ క్రమంలో తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  నాగార్జున్ సరసన నటించిన ‘అన్నమయ్య’ చిత్రంతో ఇక్కడ మరిన్ని ఆఫర్లు అందుకుంది. 
 

ప్రస్తుతం వెండితెరపై కంటే.. బుల్లితెరపైనే సందడి చేస్తోంది. ఇంటింటి గృహలక్ష్మి చిత్రంతో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. సోషల్ మీడియాలో అందాల రచ్చ చేయడంతో పాటు సూపర్ స్టైల్ గా కనిపించే ఈమె స్మాల్ స్క్రీన్ పై మాత్రం అమాయకంగా కనిపించి ప్రేక్షకుల మనస్సును దోచుకుంది. 

గృహలక్ష్మీ సీరియల్ తో తెలుగువారి మనసులు దోచుకుంది సీనియర్ హీరోయిన్ కస్తూరి.  ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా ఉంటూ.. ఈ సీరియల్ లో మాత్రం అమాయకపు ఇల్లాలిలా అలరిస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుందతి కస్తూరి..ఏమాత్రం తగ్గేది లేదంటుంది. ఆమె చేసే స్కిన్ షో తో పలు విమర్షలు కూడా తప్పడంలేదు.

Latest Videos

click me!