రెండు స్టూడియోలు, లగ్జరీ కార్లు.. కార్తీకదీపం వంటలక్క ఆస్తి విలువ తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..?

First Published | Nov 5, 2022, 1:16 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం వంటలక్క ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆమె అమాయకత్వం.. డాక్టర్ బాబు కోసం ఆమె పోరాటం.. కార్తీకదీపం సీరియల్ రేటింగ్స్ ను ఎక్కడికో తీసుకెళ్తుంది. మరి వంటలక్కగా ఫేమస్ అయిన ప్రేమివిశ్వనాథ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..? ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా..? 

ప్రేమి విశ్వనాథ్ వంటలక్కగా తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కు బాగా పరిచయం ఉన్న పేరు. ఈమె స్క్రీన్ పైన కనిపిస్తే.. దిల్ ఖుష్ అవుతారు లేడీస్. టాలీవుడ్ లో హీరోయిన్ లకు ఎంత ఇమేజ్ ఉందో.. బుల్లితెరపై ప్రేమీ విశ్వనాథ్ కు అంత ఇమేజ్ ఉంది. ఇక ఆమె గురించి తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. 
 

ఇక సోషల్ మీడియాలో  ప్రేమీ విశ్వనాథ్ గురించి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి.. ఆమె ఆస్తుల  గురించి బాగా సెర్చ్ చేస్తున్నారు ఆడయన్స్. ఈక్రమంలోనే ఆమె గురించ ఓ  విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంటలక్క లా చదివిందట. ఆమె ప్రాక్టీస్ కూడా చేస్తుందట. ఇక దాంతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రేమీ విశ్వనాథ్ కు  కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయట.  


ఆ స్టూడియోలలో మలయాళ ఇండస్ట్రీకి సబంధించిన  సినిమాలు, సీరియళ్ల షూటింగ్స్ జరుగుతాయని తెలుస్తోంది. అంతే కాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సబంధించి పనులు  జరుగుతున్నాయట. ఈక్రమంలో ఆమెకు కోట్లలో ఆస్తులు ఉన్నాయంటూ వార్త హల్ చల్ చేస్తుంది. ఆమెకు దాదాపు  40 కోట్ల వరకూ ఆస్తులు  ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 
 

ఇక్కడ కార్తీక దీపం సీరియల్ తో బాగా ఫేమస్ అయిన ప్రేమీ విశ్వనాథ్ అక్కడ  ఫ్లవర్స్ టీవీలో ఓ కార్యక్రమానికి హోస్ట్ గా కూడా చేసింది.  అంతే కాదు  పెద్ద ఫ్యామిలీ కలిగి ఉన్న ప్రేమీవిశ్వనాథ్ భర్త  ఒక ఫ్రొఫిషినల్  ఆస్ట్రాలజర్ అని తెలుస్తోంది. ఆమె భర్త పేరు డాక్టర్ వినీత్ భట్ . ఆయన 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా  అవార్డ్ కూడా తీసుకున్నాడట. 
 

premi Viswanath

 వంటలక్క నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందిని కట్టిపడేసిన ఈ నటి స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన ప్రేమి విశ్వనాథ్   ఒకే సీరియల్ లో నటిస్తున్నప్పటికీ మిగిలిన ఏ సీరియల్ నటీనటులు కూడా ఈమెను బీట్ చేయలేకపోతున్నారంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె ఇమేజ్. 
 

ఇక ఈ మధ్య వంటలక్క ఇమేజ్ పెరిగిపోయి.. కమర్షియల్ యాడ్స్ లో కూడా ఆమెను తీసుకుంటున్నారు. అంతే కాదు సినిమాల్లో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి ప్రేమి విశ్వనాద్ కు. .  ఈమె ఈ మధ్య కాలంలో సీరియల్స్ తో పాటు యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. రీసెంట్ గా  నాగచైతన్య సినిమాలో కూడా సెలెక్ట్ అయింది ప్రేమి విశ్వనాథ్. 

Latest Videos

click me!