ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ కు ఆమె భర్త సంజయ్ కపూర్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2003లో సంజయ్ కపూర్, కరిష్మా కపూర్ వివాహం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం వీరి మధ్య విభేదాలు పొడసూపాయి.
ఇవి తీవ్రరూపం దాల్చడంతో పరస్పర ఆరోపణలు చేసుకున్న ఈ జంట 2014లో విడాకుల కోసం ముంబై ఫ్యామిలీ న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఎందుకు విభేధాలు వచ్చాయి. ఎక్కడ సమస్య ఉందనే విషయం ఆమె ఎప్పుడూ పెదవి విప్పి చెప్పలేదు. ఇన్నాళ్లకు తన మనస్సులో ఉన్న ఆవేదనను బయిటపెట్టింది. ఆ విషయాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి.
ఆ ఇంటర్వూలో కరిష్మా కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది. ఆమె బయటపెట్టిన షాకింగ్ విషయాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. తన మాజీ భర్త సంజయ్ కపూర్‌తో కలిసి హానీమూన్‌కు వెళ్లినప్పుడు చోటుచేసుకున్న చేదు సంఘటన గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టింది.
తాము హానీమూన్‌కు వెళ్లినప్పుడు తన ఫ్రెండ్‌తో ఒక రాత్రి గడపాలని తనను సంజయ్ కపూర్ బలవంత పెట్టాడని కరిష్మా కపూర్ సంచలన విషయాన్ని బయటపెట్టింది.
కరిష్మా కపూర్..తన భర్త సంజయ్‌తో హానీమూన్‌కు వెళ్లినప్పుడు...అతను ఆమెకు ఓ రేటు ఫిక్స్ చేసి తన స్నేహితుడితో పడుకోవాలని సంజయ్ బలవంతం చేశాడని కరిష్మా చెప్పింది. ఒప్పుకోనందకు కొట్టాడని చెప్పింది.
పెళ్లైన తరువాత ప్రతిరోజూ వేధింపులు, సమస్యల్ని తట్టుకోలేకపోయాని అంది కరిష్మా. అందుకే 2016లో పెళ్లి పెటాకులైంది. కేవలం 13 ఏళ్లు నడిచిన వైవాహిక జీవితంలో కరిష్మా దుర్భర జీవితాన్ని చవిచూసానంది.
కేవలం సంజయ్ మాత్రమే కాదు..అతని తల్లి కూడా కరిష్మాను కొడుతుండేది. పెళ్లి సందర్బంగా చాలాసార్లు కరిష్మా కపూర్..డొమెస్టిక్ వయోలెన్స్‌కు గురైంది.
ఇవన్నీ సరిపోనట్లు... కరిష్మాతో పెళ్లైన తరువాత కూడా సంజయ్ తన మొదటి భార్యతో సంబంధం కొనసాగించాడు. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండేవాడని చెప్పుకొచ్చింది.
2012 నుంచే కరిష్మా విడిగా ఉండసాగింది. సంజయ్‌తో వివాహం కరిష్మాను చాలా వేధించింది. ఈ పెళ్లికి సంబంధించి అత్యంత దుర్భరమైన అనుభవం..హానీమూన్ నాడు ఆమెను అవమానపర్చడం ఆమె ఇప్పటికీ మర్చిపోలేనంది.
ఆ తర్వాత గొడవ ప్రిన్స్ విలియంతో పోలో మ్యాచ్ ఆడేందుకు వెళ్లడంతోనే మొదలైందని కరిష్మా కపూర్ తెలిపింది. ప్రిన్స్ విలియంతో పోలో మ్యాచ్ ఆడేందుకు దంపతులిద్దరూ కలిసి యూకే వెళ్ళాలనుకున్నారు. అయితే వారి నాలుగు నెల కుమారుడికి అనారోగ్యం కారణంగా ట్రిప్పును రద్దు చేసుకోవాల్సిందిగా కరిష్మా కోరింది. కుమారుడి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడంతోనే మనస్పర్ధలు కాస్త విడాకులకు దారితీసింది.
ప్రెగ్నెన్సీ తరువాత అత్త కోరినట్టు డ్రెస్సులు వేసుకోని తనను చెంపదెబ్బ కొట్టాలని సంజయ్ కపూర్ తన తల్లిని కోరినట్టు కరిష్మా ఆరోపిస్తోంది.
భర్త మాటలకు అత్త పల్లెత్తుమాట కూడా అనదని.. తన కుమారుడి పట్ల వివాహేతర సంబంధాలకు ఆమె మద్దతు పలుకుతోందని కరిష్మా విమర్శించింది.
కాగా, వీరికి సమైరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. వారి సంరక్షణ బాధ్యతలు కరిష్మా చూసుకోనుండగా, శని, ఆదివారాల్లో వారు సంజయ్ కపూర్ వద్దకు వెళ్లే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది.
తన సెలెబ్రిటీ స్టేటస్ చూసే సంజయ్ తనను మనువాడాడని, అయితే వివాహానంతరం శారీరకంగా హింసించేవాడని కరిష్మా కపూర్ ఆరోపించింది.
సంజయ్ తన మీద దాడి చేశాడంటూ పిల్లల్ని తీసుకుని కొన్నేళ్ల కిందటే పుట్టింటికి వచ్చేసిన కరిష్మా.. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి పలు మలుపులు తీసుకున్న ఈ కేసు ఓ కొలిక్కి వచ్చి విడాకులు వచ్చాయి.
భర్త సంజయ్ కపూర్ నుంచి విడాకులు తీసుకున్న కరిష్మా వెంటనే తాను స్వేచ్ఛా జీవిని అయిపోయానని చాటి చెబుతూ యూరప్ టూర్ వేసింది. అక్కడ ఎం.జాయ్ చేసి.. ఆ టూర్ కు సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కరిష్మా కపూర్ నటుడు రణధీర్ కపూర్ కుమార్తె. పదిహేడేళ్లకే నటనారంగంలో అడుగుపెట్టింది. 1991లో విడుదలైన ‘పేమ్‌ఖైదీ’ చిత్రంలో కధానాయికగా అరంగేట్రం చేసింది. ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది.
బాలీవుడ్‌లో ఒక దశలో అత్యధిక రెమ్యునేషన్ తీసుకొన్న నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన ‘రాజా హిందుస్థానీ’(1996) భారీ విజయం సాధించింది. కరిష్మా కపూర్ నిర్మాతగా పునఃప్రవేశం చేయనుందని మీడియాలో వార్తలొస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన వెబ్‌సీరీస్ చిత్రం మెంటల్‌హుడ్‌లో పనిచేసింది. ఓటీటీ వేదికగా కొన్ని చిత్రాలను నిర్మించి తన చెల్లి కరీనాకపూర్‌తో కలిసి విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పనులన్నీ ప్లానింగ్ దశలోనే ఉన్నాయి
కరిష్మా కపూర్ 2001లో విడుదలైన ‘ఫిజా’, ‘జుబేదా’ చిత్రాల్లో నటనకుగాను ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకొంది. ఆమె నటించిన ‘అనారీ’, ‘ఆందాజ్ అప్నా అప్నా’, ‘బీవీ నంబర్ వన్’ తదితర చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.
2004లో నటనకు స్వస్తి చెప్పిన ఆమె 2012లో ‘డేంజరస్ ఇష్క్’ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ‘జీరో’ చిత్రంలో నటించింది. బుల్లితెర నటిగా పలు కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
‘మిరాకిల్స్ ఆఫ్ డెస్టిని’ ధారావాహికలో అమ్మమ్మ, మనుమరాలి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసింది. బాగా పేరు తెచ్చిన సీరియల్ అది. ఆ తర్వాత ఆమె నటన వైపు పెద్దగా ఆసక్తి చూపలేదు.
2016లో విడాకులు పొందిన ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళల, బాలికల హక్కులపై నటి ప్రియాంక చోప్రాతో కలిపి కృషి చేసింది.
పిల్లల ఆర్థిక అవసరాలను తీర్చే బాధ్యతను సంజయ్ కపూర్ భరించాల్సి వస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. సంజయ్, కరిష్మా ల విడాకులు బాలీవుడ్ యొక్క అత్యంత ఖరీదైన విడాకులలో లెక్కించబడ్డాయి.
సంజయ్ కపూర్ విడాకుల తర్వాత కరిష్మాకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వచ్చింది. కరిష్మా కపూర్ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ ఫ్లాట్ లో నివసిస్తోంది. ఈ ఫ్లాట్ సంజయ్ కపూర్ కు చెందినది.