`కల్కి` వినాయకుడు హల్‌చల్‌, అమితాబ్‌ కమల్‌ ఓకే, ప్రభాస్‌కి దారుణమైన అవమానం

First Published | Sep 9, 2024, 5:12 PM IST

వినాయక చవితి పండగ వేళ విభిన్న రూపాల్లో ఉన్న వినాయకుడి విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. అందులో భాగంగా కల్కి వినాయకుడు ఇప్పుడు వైరల్‌గా మారారు. 
 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండుగ సందడి నెలకొంది. నవరాత్రి పూజల్లో ప్రజలంతా బిజీ అవుతున్నారు. అదే సమయంలో  సమాజంలో సినిమా ప్రభావం చాలా ఉంటుందనే విషయం తెలిసిందే. అది వినాయకుడి పండక్కి ముడిపెట్టారు అభిమానులు.

ఆ మధ్య పుష్ప గణేషుడుని తయారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్‌ వినాయకుడు సందడి చేస్తున్నారు. `కల్కి` వినాయకుడి విగ్రహం దర్శనం ఇవ్వడం విశేషం. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ రూపొందించిన `కల్కి 2898 ఏడీ` చిత్రం జూన్‌ లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా వెయ్యి కోట్లు వసూలు చేసింది. ఇందులో ప్రభాస్‌తోపాటు అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటించగా,

మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, మాళవిక నాయర్‌, ఫరియా అబ్దుల్లా, రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ, గెస్ట్‌ రోల్స్ చేశారు. ఈ సినిమా గురించి చాలా డిస్కషన్‌ జరిగింది. మైథలాజికల్‌ అంశాలను చూపించిన తీరు, సినిమా ద్వారా చెప్పాలనుకున్న విషయం, ఏం చెప్పబోతున్నారనేది చర్చనీయాంశం అయ్యింది. 
 


ఈ నేపథ్యంలో తాజాగా `కల్కి` వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. దీన్ని ఏపీలో ఓ ప్రాంతంలో ప్రతిష్టించారు. ప్రభాస్‌ అభిమానులే ఇది చేసి ఉంటారని తెలుస్తుంది. అయితే ఇందులో ప్రభాస్‌ లేకపోవడం గమనార్హం. `కల్కి` వినాయకుడిలో చిట్టి వాహనాన్ని ముందుగా హైలైట్‌ చేశారు.

లోపలకి వెళితే అందులో అమితాబ్‌ నటించిన అశ్వత్థామ లుక్‌, కమల్‌ పోషించిన సుప్రీం యాస్కిన్‌ పాత్రలకు సంబంధించిన లుక్‌తో గణపతి విగ్రహాలను రూపొందించడం విశేషం. 

అశ్వత్థామకి వినాయకుడి రూపాన్ని యాడ్‌ చేశారు. యాష్కిన్‌ని విలన్‌గానే ప్రతిష్టించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో అభిమానుల పిచ్చి పీక్‌లో కనిపిస్తుంది. అదే సమయంలో ట్రెండ్‌ని తగ్గట్టుగానే వినాయకుడి విగ్రహాలని తయారు చేసే కళాకారులు `కల్కి` సినిమా స్టయిల్‌లో వినాయకుడిని రూపొందించడం విశేషం.

కానీ ఇక్కడ డార్లింగ్‌ ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అయ్యే అంశమేంటంటే ఇందులో ప్రభాస్‌ లేడు. కేవలం అమితాబ్‌ నటించిన అశ్వత్థామ, కమల్‌ నటించిన యాష్కిన్‌ లను మాత్రమే ప్రతిష్టించారు. కానీ ప్రభాస్‌ని మాత్రం దారుణంగా అవమానించారు. 
 

ఇందులో ప్రభాస్‌ నటించిన భైరవ పాత్రని ప్రతిష్టించకపోవడం గమనార్హం. కేవలం అమితాబ్‌, కమల్‌ పాత్రలే కనిపిస్తున్నాయి. ప్రభాస్‌ పాత్రని లైట్‌ తీసుకున్నారు. అసలు ఆయనే లేకుండా ఈ `కల్కి` వినాయకుడిని ప్రతిష్టించడం విశేషం.

ఇందులో అమితాబ్‌ని హీరోని చేశారు. `కల్కి` మొదటి భాగానికి అమితాబ్బే మెయిన్ హీరో అనే కాన్సెప్ట్ లో దీన్ని డిజైన్‌ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలోనూ ఆయన్నే హీరో రేంజ్‌లో చూపించారు. ఆయన మంచి కోసం పోరాడితే, ప్రభాస్‌ చెడు కోసం, తన స్వార్థం కోసం పోరాడతాడు. ఈ కాన్సెప్ట్ లో భాగంగా అమితాబ్‌ నటించిన అశ్వత్థామకి వినాయకుడి గెటప్‌ వేశారు.
 

ప్రభాస్‌ నటించిన బైరవ పాత్రని పక్కన పెట్టారు. ఇక సినిమాలో కమల్‌ పాత్ర విలన్‌ కావడంతో ఆయన్ని సైడ్‌లో ప్రతిష్టించారు. అయితే రెండో పార్ట్ వచ్చాక అప్పుడు ప్రభాస్‌ పాత్ర లుక్‌తో వినాయకుడిని ప్రతిష్టిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అభిమానులను అలరిస్తుంది. 

`కల్కి` వినాయకుడి విగ్రహం హల్‌చల్‌

Latest Videos

click me!