కాజల్ పెళ్లైన తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అంతేకాదు గ్లామర్ విషయంలో మరింతగా డోస్ పెంచుతూ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది.
ముంబయికి చెందిన బిజినెస్‌మ్యాన్ గౌతమ్‌కిచ్లుని కాజల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ నెలాఖరులో వీరి వివాహం జరిగింది.
కరోనా నిబంధనల నేపథ్యంలో కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
అయితే తాజాగా కాజల్ గర్భవతి అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కమిట్ అయిన సినిమాలు చేసి తల్లి కాబోతుందనే ప్రచారం ఊపందుకుంది.
కానీ దీనిపై కాజల్ సన్నిహిత వర్గాలు మాత్రం అలాంటిదేమి లేదని గర్బవతి వార్తలను ఖండించారు. అందులో నిజం లేదంటూ స్పష్టం చేస్తున్నాయి.
మరి ఇంతకి కాజల్ గర్బవతి అనే వార్తలు ఎలా పుట్టుకొచ్చాయనేది ఆరా తీస్తే. మూలాలు చెల్లి నిషా అగర్వాల్ వద్ద బయటపడ్డాయి.
ఇటీవల ఆమె త్వరలో కాజల్ తల్లి కావాలని కోరుకుంటున్నా. అప్పుడు నా మూడేళ్ల కొడుకుతో ఆడుకోవడానికి ఒకరు తోడుంటారని తెలిపింది. అయితే ఆమె వ్యాఖ్యలను బట్టే ప్రస్తుతం కాజల్ పిల్లల ప్లానింగ్‌లో ఉన్నారనే వార్తలు స్ప్రెడ్ అయినట్టు తెలుస్తుంది.
కాజల్ ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తుంది. అలాగే నాగార్జునతో ఓ సినిమాకి కమిట్ అయ్యింది. తమిళంలో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మ్యారేజ్ తర్వాత మరింత జోష్‌తో ముందుకు సాగుతుందీ అందాల చందమామ.
అదే సమయంలో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టింది. భర్తతో కలిసి బిజినెస్‌లోనూ దూసుకుపోతుంది.