పెళ్లైన తర్వాత కాజల్ మొదటగా చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య` చిత్ర షూటింగ్‌లో పాల్గొంది. ఈ నెల 15న కాజల్ తన భర్త గౌతమ్‌తో వచ్చి చిరంజీవి ఆశీర్వాదాలు తీసుకుంది.
మరోవైపు తమిళ సినిమా షూటింగ్‌ని కూడా పూర్తి చేసుకునే పనిలో బిజీగా ఉంది. ఓ వైపు `ఆచార్య`, తమిళంలో `హే సినామిక` షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉంది.
తమిళంలో ప్రస్తుతం కాజల్ `ఇండియన్ 2`తోపాటు `హే సినామిక` చిత్రంలో నటిస్తుంది. `ఇండియన్ 2` వాయిదా పడగా. `హే సినామిక` చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా చివరి రోజు షూట్ ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా, కాజల్, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొరియోగ్రాఫర్ బ్రిందాగోపాల్ ఈ సినిమాతో దర్శకురాలిగా మారారు.
చివరి రోజు షూట్‌లో దుల్కర్ సల్మాన్, కాజల్, అదితి రావు హైదరీ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
మరోవైపు భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి కొత్త వ్యాపారం మొదలు పెట్టింది కాజల్. `కిచ్డ్` పేరుతో దిండ్ల ఉత్పత్తులను పరిచయం చేసింది. ఆన్ లైన్ బిజినెస్‌కి తనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. మరోవైపు భర్త ఇంటీరియర్ డిజైనింగ్, వాటి ప్రొడక్ట్స్ కి కూడా ప్రమోషన్ చేస్తూ ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తున్నారీ కొత్త జంట.
కాజల్, గౌతమ్ అక్టోబర్ 30న ముంబయిలో గ్రాండ్‌గా పెళ్ళి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భర్తతో కలిసి దిగిన ఫోటోలు సందడి చేశాయి.
ఆ వెంటనే ఇద్దరు కలిసి మాల్దీవులకు హనీమూన్ చెక్కేశారు. తెగ ఎంజాయ్ చేశారు. ఏకంగా సముద్రంలోని అక్వేరియంలోనే ఫస్ట్ నైట్ చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు.