నయా లుక్స్ తో మైమరిపిస్తున్న చందమామ.. మత్తు చూపులతో కట్టిపడేస్తున్న కాజల్ అగర్వాల్

First Published | Mar 10, 2023, 3:57 PM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) బ్యాక్ టు బ్యాక్  ఫొటోషూట్లతో నయా లుక్స్ లో దర్శనమిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. లేటెస్ట్ గా కాజల్ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటుంటోంది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ తెలుగు ఆడియెన్స్ కు సుపరిచితమే. కొన్నేండ్ల పాటు వరుస చిత్రాల్తో అలరించిన  ఈ చందమామ.. పెళ్లి తర్వాత కాస్తా బ్రేక్ ఇచ్చింది.  మళ్లీ కేరీర్  పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం సినిమాల్లోనే బిజీగా అయిపోతున్నారు. 
 

మొదటి లాక్ డౌన్ లో కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో 2020 అక్టోబర్ 30న ముంబైలో పెళ్లి జరిగింది. ఇక గతేడాది 2022 ఏప్రిల్ 19న మగబిడ్డకు జన్మనిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందారు. పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా  సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చారు. 
 


ప్రస్తుతం మళ్లీ కేరీర్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు కాజల్ అగర్వాల్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. తాజాగా కాజల్ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

బ్లూ అండ్ వైట్ క్యాజువల్ వేర్ ధరించి నయా లుక్ లో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ లో కాస్తా సన్నగా కలినిపిస్తూ వింటేజ్ లుక్ ను సొంతం చేసుకుందని అంటున్నారు. మరోవైపు అదిరిపోయే పోజులతో కట్టిపడేస్తోంది. దీంతో ఫ్యాన్స్ అట్రాక్ట్ అవుతూ ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

మరోవైపు కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సందర్భంగా  సినిమా అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో గ్రాండ్ గా కంబ్యాక్ ఇచ్చేందుకు తమిళస్టార్, లోకనాయకుడు కమల్ హాసనన్ ‘ఇండియన్2’లో నటిస్తున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే.  

అలాగే హిందీలోనూ మరో చిత్రానికి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘షూట్ అవుట్ ఎట్ బైకుల్ల’లో కీలక పాత్రన పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కాజల్ నటించిన ‘గోస్టీ’,‘ఉమా’,‘కరుంగాపియమ్’ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి.  ఈక్రమంలో నెట్టింట ఇలా సందడి చేస్తూనే ఉంది. క్రేజీ అప్డేట్స్ తో ఆకట్టుకుంటూనే ఉంటోంది. 

Latest Videos

click me!