ఆచార్యలో కనిపించని కాజల్, సినిమా నుంచి తీసేసినా.. ఎందుకు కామ్ గా ఉందో తెలుసా...?

Published : Apr 29, 2022, 11:35 AM IST

ఆచార్యలో ఆడియన్స్ కు చిన్న షాక్ తగిలింది. ఫస్ట్ నుంచీ ఈ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయిన ఉన్న కాజల్ ఈ సినిమాలో కనిపంచలేదు. ఈ విషయంలో కొరటాల వివరణ ఇచ్చినప్పటికీ.. చాలా మందికి కాజల్ లేదు అన్న విషయం తెలియదు. అయితే ఈ సినిమా నుంచి తీసేసినా.. కాజల్ సైలెంట్ గా ఎందుకు ఉందో తెలుసా..?  

PREV
16
ఆచార్యలో కనిపించని కాజల్, సినిమా నుంచి తీసేసినా.. ఎందుకు కామ్ గా ఉందో తెలుసా...?

టాలీవుడ్ చందమామ కాజల్ తెలుగులో కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది.  సినీ అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న కాజల్ పెళ్లి చేసుకుని రీసెంట్ గా తల్లి కూడా అయ్యింది. అయితే అంతకు ముందు వరకూ కాజల్ నటిస్తూనే ఉంది. టాలీవుడ్ మెగా మూవీ ఆచార్యలో కూడా ఆమె హీరోయిన్ గా చేసింది. 
 

26

అయితే ఆచార్య సినిమాలో ఆమె నటించింది కాని.. సినిమాలో మాత్రం లేకుండా పోయింది.  ఈసినిమాలో  మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా ఆమె నటించింది. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. అయితే ఈ సినిమా నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు మేకర్స్. 
 

36

ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కాజల్ పాత్ర సంతృప్తికరంగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు డైరెక్టర్  కొరటాల శివ వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని కాజల్ కు  కూడా వివరించగా ఆమె కామ్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. ఈ విషయంలో కాజల్ కు ఏమాత్రం అసంతృప్తి లేదని తెలుస్తోంది. 
 

46

అయితే, సినిమా నుంచి కాజల్ తప్పుకోవడంపై ఫిలిం ఇండస్ట్రీలో మరో వార్త వినిపిస్తోంది.  మూమూలుగా అయితే సినిమా నుంచి మధ్యలో తప్పిస్తే హీరోయిన్లు ఎవరూ ఊరుకోరు కాని కాజల్ మాత్రం కామ్ గా ఉండటానికి ఓకారణం ఉంది అని  ఇండస్ట్రీ టాక్ 
 

56

ఈ సినిమా  నుంచి ఆమె తొలి షెడ్యూల్ తర్వాత తప్పుకున్నప్పటికీ... అప్పటికే తన రెమ్యునరేషన్ ను తీసేసుకుందట. దాదాపు కోటిన్నర రూపాయలను ఆమె తీసుకుందని చెపుతున్నారు. తనకు రావాల్సిన డబ్బు వచ్చినందున... సినిమా నుంచి పక్కన పెట్టినా ఆమె సైలెంట్ గా ఉందని అంటున్నారు. 

66

అంతే కాదు  తనకు పెళ్ళి కావడం, వెంటనే ప్రెగ్నన్సీ ప్లానింగ్ లో ఉండటంతో  సినిమాలను లైట్ తీసుకుంటుంది కాజల్. ఆచార్య సినిమాతో పాటు కమల్ హాసన్ తో భారతీయుడు2 కూడా వదిలేసుకుంది కాజల్. వీటితో పాటు మరికొన్ని మూవీస్ నుంచి కూడా తప్పుకుని, ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. 

click me!

Recommended Stories