పలువురు నటీమణులు, నటులను సంప్రదించిన హేమ కమీషన్ దేశంలోనే అత్యధికంగా మలయాళ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తేల్చారు. దీనికి బాధ్యత వహిస్తూ మోహన్ లాల్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ కి రాజీనామా చేశాడు.
పలువురు నటీమణులు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని మీడియా ముందుకు వస్తున్నారు. స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ పై లైంగిక ఆరోపణలు వస్తున్నాయి. వినూత్న కంటెంట్ ఇచ్చే పరిశ్రమగా పేరుగాంచిన మలయాళ పరిశ్రమ హేమ కమిటీ రిపోర్ట్ తో పరువు పోగొట్టుకుంది.