పెళ్లయిన ఏడాదికే ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని, తనకు మనశాంతి లేకుండా చేసి ఆమె తనను కొట్టేదని జానీ కోర్టుకు వెల్లడించారు. అసభ్యకరమైన మాటలతో తనను వేధిస్తూ, మానసిక వేదనకు గురి చేసేదని స్టార్ హీరో తన బాధను వెల్లడించారు. వైన్ గ్లాస్, టీవీ రిమోట్ తన తలపైకి విసిరేదని, ఇష్టం వచ్చినట్టు తిడుతూ.. మాటలతో మనోవేధన కలిగించిందన్నారు.