దగ్గరగా పరిశీలిస్తే కానీ తెలియదు హీరోయిన్ సదా పరువాల పవర్... ఎల్లో కలర్  ఫ్రాక్ లో ఏముందిరా బాబు!

First Published | Apr 25, 2023, 11:10 AM IST

హీరోయిన్ సదాలో గ్లామర్ పవర్ ఏమాత్రం తగ్గలేదు. స్టార్ గా రిటైర్ అయినా సూపర్ హాట్ గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. తరచి చూస్తే ఆమె అద్భుత సౌందర్యం అవగతం అవుతుంది. 

Heroine Sadaa

జయం భామ సదాకు సిల్వర్ స్క్రీన్ కి దూరమై చాలా రోజులు అవుతున్నా యూత్ లో క్రేజ్ తగ్గలేదు. తిరిగి ఆమె చిత్రాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అభిమానుల ఆశలను కనీసం సోషల్ మీడియా వేదికగా తీర్చే ప్రయత్నం చేస్తుంది. 

Heroine Sadaa


సదా టీవీ హోస్ట్ అవతారం ఎత్తారు. ఇటీవల ఆమె డీడీ జోడి జడ్జిగా వ్యవహరించారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. బీబీ జోడి షోలో సదా గ్లామర్ హైలెట్ అని చెప్పాలి.  ఈ షోకి సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా ఉన్నారు. వీరితో పాటు సదా జాయిన్ అయ్యారు. బీబీ జోడీ కొద్దిరోజుల క్రితం ముగిసింది. 
 


Heroine Sadaa


గతంలో కొన్ని డాన్స్ రియాలిటీ షోలకు సదా జడ్జిగా వ్యవహరించారు. తెలుగు పాపులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ  రెండు సీజన్స్  కి జడ్జిగా చేశారు. జయా టీవీలో ప్రసారమైన షోకి మొదటిసారి ఆమె జడ్జిగా వ్యవహరించారు. ఇక సదా కెరీర్ పరిశీలిస్తే ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతుంది. 2018లో విడుదలైన తమిళ చిత్రం టార్చ్ లైట్ తర్వాత మరలా కనిపించలేదు. మంచి ఆఫర్ వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నారు. 
 

Heroine Sadaa

సదా పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది. జయం డెబ్యూ మూవీ 2002లో విడుదలైన సెన్సేషనల్ విజయం సాధించింది.  ఆ మూవీతో సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. 
 

Heroine Sadaa

జయం మూవీ సదాకు వరుస ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ఆమె బిజీ యాక్ట్రెస్ అయ్యారు . అయితే ఆమెకు స్టార్స్ పక్కన అరుదుగా అవకాశాలు వచ్చాయి. ఫార్మ్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కి జంటగా నటించిన నాగ ఆడలేదు. అనంతరం బాలయ్యతో వీరభద్ర చిత్రం చేసింది. ఇది కూడా నిరాశపరిచింది. 

Heroine Sadaa

ఇక సదా కెరీర్లో ఉన్న మరో అతిపెద్ద హిట్ అపరిచితుడు. దర్శకుడు శంకర్-విక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ సదా ప్లాప్స్ తో రేసులో వెనుకబడింది. ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2016 తర్వాత రెండేళ్లు ఆమె పరిశ్రమకు దూరమయ్యారు.
 

Latest Videos

click me!