బాలీవుడ్ హీరోకి ఇల్లు అమ్మిన జాన్వీ కపూర్, ఎన్ని కోట్ల లాభం వచ్చిందంటే..?

First Published | Jul 31, 2022, 10:04 AM IST

బాలీవుడ్ యంగ్ స్టార్.. అతిలోక సుందరి జన్వీ కపూర్ తన ఇల్లు అమ్మేసింది. ప్రముఖ బాలీవుడ్ హీరోకి తన ట్రీప్లెక్స్ హౌస్ ను అమ్మసిందట. అంతే కాదు ఈ ఇల్లు అమ్మడంతో భారీగా లాభం కూడా వచ్చిందట. మరి ఎంతకి అమ్మింది...? ఎవరికి అమ్మింది..? జాన్వీకి ఎంత లాభం వచ్చింది..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ ఇళ్లు ఎంత లగ్జరీగా ఉంటాయో అందరికి తెలిసిందే. కొన్ని కోట్ల విలువచేసే ఇంటిని కొంటుంటారు నచ్చకపోతే  అమ్ముతుంటారు. ఫిల్మ్ స్టార్స్.. ఈ మ‌ధ్య కొత్త ఇల్లులు కొనుగోలు చేయ‌డం అమ్మ‌డం కామ‌న్ అయిపోయింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ ఈ మధ్య ఎక్కువగా ఇళ్లు కొని అమ్ముతున్నారు. ఇక రీసెంట్ గా యంగ్ స్టార్ జాన్వీ కపూర్ తన లగ్జరీ హౌస్ ను అమ్మేసింది. 

బాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరో గా గుర్తింపు పొందాడు రాజ్ కుమార్ రావు. ఆయన రీసెంట్ గాముంబయ్ లో ఓ విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేశాడు. జాన్వీ కపూర్ అమ్మిన ఇల్లు.. రాజ్ కుమార్ కొన్న ఇల్లు ఒకటే.. జాన్వీ కపూర్ కు చెందిన  ముంబైలోని  విలాస‌వంత‌మైన ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ ను ఆయన  కొనుగోలు చేశార‌ట‌.


ఈ అపార్ట్‌మెంట్ ముంబైలోని అత్యంత కాస్ట్లీ ప్లేస్  జుహులో ఉంది. రాజ్ కుమార్ ఈ అపార్ట్ మెంట్ న‌టి జాన్వీక‌పూర్ నుంచి  భారీ రేటుకు ఆయన కొన్నారట. ఈ అపార్ట్ మెంట్ ను జాన్వీ కపూర్  44 కోట్లకు రాజ్ కుమార్ కు అమ్మినట్టు తెలుస్తోంది.  రాజ్‌కుమార్, జాన్వీ కపూర్ కలిసి గతంలో  రూహి  సినిమాలో నటించారు. 

ఇక ఈ ఇంటిని  అమ్మ‌డం ద్వారా జాన్వీక‌పూర్ కు భారీగానే లాభం వచ్చినట్టు తెలుస్తోంది. రెండు సంవ‌త్స‌రాల క్రితం జాన్వీ  క‌పూర్ ఈ ఇంటిని 39 కోట్లకు  కొనుగోలు చేసింది. 2020 డిసెంబర్ జాన్వీ కపూర్ ఈ ఇంటిని కొన్నారు. 2022 లో రాజ్ కుమార్ రావ్ కు అమ్మేశారు. ఈ డీల్ ద్వారా జాన్వీకి 5 కోట్ల వరకూ లాభం వచ్చింది. 

3456 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ లో.. చ‌ద‌ర‌పు అడుగు ధ‌ర 1.27 లక్ష‌లు. దేశంలోనే అత్యంత ఖ‌రీదైన డీల్స్ లో ఇది ఒక‌టి. ఇక ఈ అపార్ట్‌మెంట్ భ‌వ‌నాన్ని బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌, బిల్డ‌ర్ ఆనంద్ పండిట్ నిర్మించారు. ఈ భ‌వనాన్ని లోట‌స్ ఆర్య అని పిలుస్తుంటారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది నివసించారు. 

అయితే గతంలో రాజ్ కుమార్ రావు త‌న భార్య పత్ర‌ లేఖ‌తో క‌లిసి ఇదే భ‌వ‌నంలోని 11, 12 అంత‌స్తుల్లో అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేశారు. ఇక ఇప్పుడు ఈ అపార్ట్‌మెంట్ 14, 15, 16 అంత‌స్తు వ‌ర‌కు ఉన్న ట్రీప్లస్ ప్లాట్ ను జాన్వీ కపూర్ నంచి కొనుగోలు చేశారు.  ఈ డీల్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 
 

Latest Videos

click me!