శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇకపై సౌత్ ఆడియెన్స్ ను అలరించబోతోంది.
ఇక్కడ తొలిసినిమానే ఏకంగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR)తో కలిసి నటిస్తుండటం ఆమె ఎంట్రీపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఎన్టీఆర్ సరసన నటిస్తుండటంతో ఈ ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్లినా అది సౌత్ ఆియెన్స్ కు వార్తగా మారుతోంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తున్న జాన్వీ కపూర్.. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. వరుస ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది. ట్రెండీ వేర్స్ లోమెరుస్తూ ఆకట్టుకుంటోంది.
ఇక తాజాగా యంగ్ బ్యూటీ బాలీవుడ్ చిత్రం Teri Baaton Mein Aisa Uljha Jiya ప్రీమియర్ షోకు హాజరైంది. షాహిద్ కపూర్ - క్రితి సనన్ జంటగా నటించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. నిన్న ప్రీమియర్స్ చూసేందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్ లో మెరిసింది.
స్లిమ్ ఫిట్ బాడీని చూపిస్తూ పలచటి డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. సింపుల్ అండ్ అట్రాక్టివ్ లుక్ తో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. ప్రస్తుతం జాన్వీ ఫొటోలు వైరల్ గా మారాయి.
అయితే ఆమె లుక్ ను చూసిన నెటిజన్లు పక్కోళ్ల సినిమాకే జాన్వీ అట్రాక్టివ్ లుక్ లో మెరుస్తోందంటే.. ఇక మన సినిమా ‘దేవర’కు ఎలాంటి లుక్స్ తో కట్టిపడేస్తోందనని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘దేవర : పార్ట్ 1’ ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది.