`జబర్దస్త్‌` వర్ష, హైపర్‌ ఆది, సురేఖ వాణి, శేఖర్‌ మాస్టర్‌, వర్షిణి.. బిగ్‌బాస్‌5 లిస్ట్?.. ఈ సారి రచ్చ రచ్చే?

First Published | Jul 3, 2021, 6:35 PM IST

రియాలిటీ షో `బిగ్‌బాస్‌` ఐదో సీజన్‌లో పాల్గొనే వారిలో `జబర్దస్త్` వర్ష, హైపర్‌ ఆది, యాంకర్‌ వర్షిణి, శేఖర్‌ మాస్టర్‌, షణ్ముఖ్‌, సురేఖ వాణి, దుర్గారావు, సింగర్‌ మంగ్లీ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్‌ లిస్ట్ ఇదే అంటూ ఓ వార్త వైరల్‌ అవుతుంది.

కరోనా వల్ల బిగ్‌బాస్‌ 4 సీజన్‌ కూడా ఆలస్యంగా సెప్టెంబర్‌లో ప్రారంభమైంది.ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ సైతం బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌పై ప్రభావాన్ని చూపించింది. జనరల్‌గా జూన్‌లోనే ఈ షోని ప్రారంభించాలనుకున్నారు. కానీ సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా రావడంతో బ్రేకులు పడ్డాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు షోలో పాల్గొనే కంటెస్టెంట్‌ లిస్ట్ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. ఇందులో పాల్గొనే 16 మంది వీరే అంటూ ప్రచారం జరుగుతుంది. వీరిలో క్రేజీ యాంకర్స్, కమెడీయన్స్, నటీనటులుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
సోషల్‌ మీడియాలో, టీవీలో విపరీతమైన ఫాలోయింగ్‌ కలిగిన వారిని ఈ సారి కంటెస్టెంట్లుగా తీసుకోబోతున్నారట. తాజా జాబితా చూస్తుంటే బిగ్‌బాస్‌ 5 హౌజ్‌ రచ్చ రచ్చగా ఉండబోతుందని అర్థమవుతుంది. నాలుగో సీజన్‌లో పెద్దగా క్రేజ్‌ లేనివారిని తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సారి చాలా జాగ్రత్త పడుతూ, క్రేజీ స్టార్స్, కామెడీయన్స్‌, హాట్‌ యాంకర్స్, యాక్ట్రెస్‌లను దించబోతున్నట్టు టాక్‌. మరి ఈ జాబితాలోని వారెవరో చూస్తే.

`జబర్దస్త్` తో బాగా పాపులర్‌ అయ్యింది వర్ష. ఓ వైపు హాట్‌ ఫోటో షూట్లు, మరోవైపు ఇమ్మాన్యుయెల్‌తో కామెడీని, లవ్‌ ట్రాక్‌ని నడిపిస్తూ విపరీతమైన ఫాలోయింగ్‌ని తెచ్చుకున్న ఈ భామ బిగ్‌బాస్‌ 5 కంటెస్టెంట్‌గా ఎంపికైందట.
`జబర్దస్త్`లో పంచ్‌లతో పాపులర్‌ అయిన హైపర్‌ ఆదిని ఈ సారి హౌజ్‌లోకి తీసుకురాబోతున్నారట.
అలాగే ఇటీవల సోషల్‌ మీడియాలో పొట్టి డ్రెస్సులతో దుమ్ములేపుతున్న నటి సురేఖా వాణి సైతం ఈ సారి హౌజ్‌లోకి తీసుకురావాలని డిసైడ్‌ అయ్యారట బిగ్‌బాస్‌ టీమ్‌.
హాట్‌ హాట్‌ అందాలతో నెటిజన్ల మతిపోగొడుతున్న యాంకర్‌ వర్షిణి సైతం బిగ్‌బాస్‌ 5లో సందడి చేయబోతుందని టాక్‌.
అద్భుతమైన గాత్రంతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న సింగర్‌ మంగ్లీ సైతం బిగ్‌బాస్‌ 5లోకి ఎంపికైందని సమాచారం.
టాలీవుడ్‌ టాప్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ని ఈ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంపిక చేశారట.
టిక్‌ టాక్‌తో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయారు దుర్గారావు. ఆయనకు ఈ సారి బిగ్‌బాస్‌ బెర్త్ ఖాయమంటున్నారు.
యూట్యూబ్‌ వీడియోలతో యూట్యూబ్‌ స్టార్‌గా పేరుతెచ్చుకున్న షణ్ముఖ్‌ జస్వాంత్‌ని బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి ఎంపికయ్యారని సోషల్‌ మీడియా టాక్‌.
పాపులర్‌ కమేడియన్‌ ప్రవీణ్‌ని బిగ్‌బాస్‌ హౌజ్‌లో సందడి చేయబోతున్నట్టు సమాచారం.
టీవీ9 హాట్‌ యాంకర్‌ ప్రత్యూషని కూడా తీసుకోబోతున్నారట. గత సీజన్‌లో న్యూస్‌ టీవీల నుంచి దేవి నాగవళ్లి, సుజాత సందడి చేశారు.
వీరితోపాటు పలు టీవీ షోస్‌తో మంచి పేరుతెచ్చుకున్న యాంకర్‌ శివ కూడా ఎంపికయ్యారని సమాచారం.
టిక్‌టాక్‌ స్టార్‌ భాను ఎంపికైందట.
మరో యూట్యూబ్‌ స్టార్‌ ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ సైతం బిగ్‌బాస్‌లోకి వస్తున్నట్టు టాక్‌. కానీ ఇతనిపై పలు విమర్శలు వస్తున్నాయి.
సినిమాల నుంచి సీనియర్‌ నటి యమున హౌజ్‌లోకి అడుగుపెడుతుందట.
అలాగే సినిమాలు, సీరియల్స్ లో రాణిస్తున్న ప్రియ కూడా ఎంపికైందని సమాచారం.
వరంగల్‌ వందన కి బెర్త్ ఖాయమేనంటూ టాక్‌. ఈ 16 మంది ఫైనల్‌ అయ్యారని వినిపిస్తుంది.వీరితోపాటు టీవీ5 మూర్తి కూడా హౌజ్‌లోకి రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. నాల్గో సీజన్‌లో మాదిరిగానే రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంచి ఆ తర్వాత హౌజ్‌లోకి పంపిస్తారట.
ఇదిలా ఉంటే ఈ సారి బిగ్‌బాస్‌5కి హోస్ట్ మారుతున్నారనే వార్త కూడా వినిపిస్తుంది. నాగార్జున స్థానంలో రానా రాబోతున్నారని వినిపిస్తుంది. మరి దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

Latest Videos

click me!