జబర్దస్త్ రోహిణికి డ్రగ్స్ అలవాటు ఉందా? పబ్బులు, పార్టీలో ఎంజాయ్ చేస్తుందా? ఆ వీడియోతో అడ్డంగా బుక్  

First Published | Jul 6, 2024, 7:09 AM IST

జబర్దస్త్ ఫేమ్ రోహిణి అరెస్ట్ అయ్యారు. శుక్రవారం రాత్రి ఆమె ఓ రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారు. దాడి చేసిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నారై పార్టీ అంటే వచ్చాను నాకేం తెలియదంటూ రోహిణి వేడుకుంది... ఈ వీడియో వైరల్ అవుతుంది. 
 


నటి హేమ అరెస్ట్ ఇటీవల కలకలం రేపింది. బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. సదరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు వంద మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. నటి హేమ సైతం అరెస్ట్ అయ్యారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ టెస్ట్స్ లో తేలింది. హేమ ఈ కేసులో రిమాండ్ చేశారు. అనంతరం బెయిల్ మీద విడుదలైంది. 
 

Actress Hema

మొదట హేమ బుకాయించింది. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవాస్తవాలు నమ్మొద్దని ఆమె వీడియో బైట్ విడుదల చేసింది. ఆమె అబద్దం చెప్పారని తర్వాత తేలింది. రెండుసార్లు విచారణకు హాజరుకాని హేమ మూడోసారి నోటీసులు ఇవ్వడంతో విచారణకు సహకరించింది. 


Hema


నటి హేమ అరెస్ట్ టాలీవుడ్ వార్తల్లో చర్చకు దారి తీసింది. ఆమె మీద మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలు తీసుకోవడం విశేషం. హేమ మా సభ్యత్వం రద్దు చేసినట్లు సమాచారం. అరెస్ట్ పై హేమ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆమె మీడియా ముందుకు కూడా రాలేదు. 
 

Jabardasth Rohini


తాజాగా మరొక నటి రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. జబర్దస్త్ కమెడియన్ రోహిణిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఓ ఎన్నారై బర్త్ డే పార్టీకి రోహిణి హాజరైంది. ఆ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన రోహిణి నాకేమీ తెలియదంటూ వేడుకుంది. 

Jabardasth Rohini


పోలీసుల అదుపులో ఉన్న రోహిణిని మీడియా ప్రతినిధులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నాకేం సంబంధం లేదు. బర్త్ డే పార్టీ అంటే వచ్చాను. నాకేమీ టెస్ట్ లు చేయలేదు. పాజిటివ్ కూడా రాలేదు. ఇలాంటి ఎన్నారై పార్టీలు అన్నప్పుడు వివరాలు తెలుసుకోకుండా రావొద్దని ఆమె ఆవేదన చెందారు. ఏం తెలియకుండానే రేవ్ పార్టీకి వచ్చావా? అని పోలీసులు ఆమెను గద్దిస్తున్నారు. 
 

Jabardasth Rohini

అయితే ఇది ఫ్రాంక్ వీడియో అని సమాచారం. ఓ మూవీ ప్రమోషన్ కోసం నటి రోహిణి ఇలా ఫ్రాంక్ చేసినట్లు తెలుస్తుంది. సినిమాలు, సిరీస్లలో ప్రమోషన్స్ కోసం ఈ మధ్య ఫ్రాంక్ వీడియోలు చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల పరువు వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం హీరోయిన్ నివేద పేతురాజ్ ఓ ఫ్రాంక్ వీడియో చేశారు. తన కారును పోలీసులు ఆపినట్లు, ఆమె దురుసుగా వ్యవహరించినట్లు ఫ్రాంక్ వీడియో చేసి వదిలారు. అది నిజమే అని జనాలు నమ్మారు. 
 

రోహిణి కూడా బర్త్ డే బాయ్ అనే ఓ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఫ్రాంక్ వీడియో చేశారని సమాచారం. ఈ వీడియో నటి హేమ ఉదంతాన్ని గుర్తు చేసింది. కాగా రోహిణి జబర్దస్త్ కమెడియన్ గా చేస్తూనే పలు చిత్రాలు, వెబ్ సిరీస్లలో ఆఫర్స్ దక్కించుకుంటుంది. 
 

Latest Videos

click me!