`జబర్దస్త్` బాబులో మ్యాటర్‌ లేదా?.. లేడీ కమెడియన్‌ సంచలన స్టేట్‌మెంట్‌.. వర్ష-ఇమ్మూని మించిన లవ్‌ స్టోరీ

`జబర్దస్త్` కామెడీ షో లవర్స్ కి అడ్డగా మారుతుంది. ఈ షోలో చాలా మంది ప్రేమ జంటలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మరో జంట పాపులర్‌ అవుతుంది. కంటెంట్‌ ఇస్తూ ఆకట్టుకుంటుంది. 
 

extra jabardasth promo

జబర్దస్త్ షోలో యాంకర్‌ రష్మి, సుడిగాలి సుధీర్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ నడిపించారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్‌, జబర్దస్త్ వర్ష మధ్య లవ్‌ ట్రాక్‌ రన్‌ చేశారు. సక్సెస్‌ అయ్యారు. వీరి ద్వారా షోకి మంచి రేటింగ్‌ వచ్చింది. ఆ తర్వాత రాకింగ్‌ రాకేష్‌, సుజాత మధ్య లవ్‌ ట్రాక్‌ నడిపించారు. అంతేకాదు ఏకంగా ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు మరో ప్రేమ జంట పుట్టుకొచ్చింది. 
 

extra jabardasth promo

జబర్దస్త్ కమెడియన్‌ బాబు, లేడీ కమెడియన్‌ శ్రీ విద్యలు కలిసి చాలా రోజులుగా స్కిట్లు చేస్తున్నారు. బాబుపై శ్రీకాకుళం యాసలో శ్రీ విద్య పంచ్‌లు వేస్తూ ఆకట్టుకుంటుంది. నవ్వులు పూయిస్తుంది. చాలా రోజులుగా ఈ టీమ్‌ కూడా కామెడీ పరంగా నవ్వులు పూయిస్తూ హైలైట్‌గా నిలుస్తున్నారు. ముఖ్యంగా శ్రీవిద్య పంచ్‌లు, డైలాగులు బాగా ఆకట్టుకుంటున్నాయి. నవ్వులు పంచుతున్నాయి. 


extra jabardasth promo

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తుంది. అడపాదడపా తమ ప్రేమని బయటపెడుతూనే ఉన్నారు. కానీ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఉన్నది సీరియస్‌ లవ్వే అని అర్థమవుతుంది. తమ స్కిట్ల ద్వారా, స్టేజ్‌పై కూడా అదే విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆ విషయాన్ని వెల్లడించారు. 

extra jabardasth promo

తాజాగా `ఎక్స్ ట్రా జబర్దస్త్` షో ప్రోమో విడుదలైంది. ఇందులో బాబు, శ్రీవిద్యల మధ్య లవ్‌ ట్రాక్‌ ఆసక్తికరంగా మారింది. కానీ ఇందులో బాబుపై శ్రీవిద్య చేసిన కామెంట్ మాత్రం దుమారం రేపుతుంది. ఓ రకంగా బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది శ్రీవిద్య. బాబుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

extra jabardasth promo

వీరి ప్రస్తావన వచ్చినప్పుడు యాంకర్‌ రష్మి ఇన్ వాల్వ్ అవుతూ, `జనరల్‌గా అబ్బాయిలు వెంటపడతారు, అమ్మాయిలు దూరం పెడతారు. కానీ ఇక్కడ అమ్మాయి వెంటపడుతుంది, అబ్బాయి ఎందుకు దూరం పెడుతున్నాడు అంటూ ప్రశ్నించింది. దీనికి శ్రీవిద్య రియాక్ట్ అయ్యింది. 
 

extra jabardasth promo

`తను(బాబు) ఆసీ(ఉప్పెన సినిమాలో హీరో వైష్ణవ్‌ తేజ్‌ క్లైమాక్స్ ప్రస్తావన తెస్తూ)లా అయిపోయాడు, కాబట్టి నేను ఆశపడటం మనేశాను అని బోల్ట్ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది లేడీ కమెడియన్‌. పరోక్షంగా బాబులో మ్యాటర్ లేదనే విషయాన్ని చెప్పింది శ్రీవిద్య. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. 
 

extra jabardasth promo

 దీనికి బాబుకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. షాక్‌లో ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. తర్వాత బాబు కోసం మంచి విషయం చెప్పాలనిపిస్తే ఏం చెబుతావు అని వర్ష ప్రశ్నించగా, `బాబు.. అవుతావా నా బాబుకి బాబు` అంటూ ప్రశ్నించింది. దీంతో షో మొత్తంలో నవ్వులు విరిసాయి. 

extra jabardsath promo

దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. బాబు-శ్రీవిద్యలది నిజమైన ప్రేమ అని, వర్ష-ఇమ్మాన్యుయెల్‌లది కాదని అంటున్నారు. బాబు, శ్రీవిద్యల కలవాలని కోరుకుంటున్నారు. వర్ష, ఇమ్మూ కంటే వీళ్లు నిజమైన ప్రేమికులు అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది. 

Latest Videos

click me!