సుధీర్‌పై ముక్కు అవినాష్‌ హాట్‌ కామెంట్‌.. ఆయన పక్కన ఉంటే సన్నీలియోన్‌ సంకన ఉన్నట్టే అంటూ షాక్‌..

First Published | Jan 21, 2023, 9:52 AM IST

`జబర్దస్త్` ఎక్స్ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌పై ముక్కు అవినాష్‌ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఆయన్ని శృంగార తార సన్నీలియోన్‌తో పోల్చాడు. అంతేకాదు పక్కన ఉంటే అంటూ పెద్ద షాకిచ్చాడు అవినాష్‌.

సుడిగాలి సుధీర్‌ మల్టీటాలెంటెడ్‌. కామెడీని పంచడమే కాదు, మ్యాజిక్‌ చేస్తాడు, పాటలు పాడతాడు, మంచి నటుడు, యాంకర్‌. ఆయన ఉన్న ఏ షో అయినా హిట్‌ అవ్వాల్సిందే. అంతగా పేరుతెచ్చుకున్నారు. యాంకర్‌ రష్మితో కెమిస్ట్రీ పండించి మరింతగా క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. బుల్లితెరపై భారీ అభిమానులనుఏర్పర్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే బుల్లితెర మెగాస్టార్ ట్యాగ్‌ ని సొంతం చేసుకున్నారు. 
 

`జబర్దస్త్`కామెడీ షోతో పాపులర్‌ అయిన సుధీర్‌.. గతేడాది మిడిల్‌లో షోని వదిలేసిన విషయం తెలిసిందే. సినిమాలు, ఇతర ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను `జబర్దస్త్`ని వదిలేస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు, ఈటీవీ, మల్లెమాల నిర్వహించే `శ్రీదేవి డ్రామా కంపెనీ` నుంచి కూడా తప్పుకున్నారు సుధీర్‌. ఆ మధ్య `సూపర్‌ సింగర్స్ జూనియర్‌` షోకి అనసూయతో కలిసి యాంకరింగ్‌ చేశాడు. ఇప్పుడు దీపికా పిల్లితో కలిసి `ఆహా`లో `కామెడీ స్టాక్‌ ఎక్స్ ఛేంజ్‌` అనే స్టాండప్‌ కామెడీషోకి యాంకరింగ్‌ చేస్తున్నారు. 
 


ఇందులో జబర్దస్త్ బ్యాచ్ చాలా మంది కామెడీని పంచుకుతూ ఆకట్టుకుంటున్నారు. దీనికి దర్శకుడు అనిల్‌ రావిపూడి జడ్జ్(చైర్మెన్‌)గా వ్యవహరిస్తున్నారు. వేణు, అవినాష్‌, సద్దామ్‌, అలాగే `కామెడీస్టార్స్` బ్యాచ్‌లో ఇందులో పాల్గొంటుంది. ఒక్కొక్కరు కామెడీ స్కిట్లు చెప్పి నవ్వులు పూయించాల్సి ఉంటుంది. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ముక్కు అవినాష్‌ స్క్రిప్ట్ లో అతను సుధీర్‌పై ఓ హాట్‌ కామెంట్‌ చేశారు. 
 

తన కామెడీ స్కిట్‌ చేస్తున్న అవినాష్‌.. సుధీర్‌, వేణు, రాంప్రసాద్‌, ధన్‌రాజ్‌ ఇలా అందరు కలిసి 2017లో అమెరికా ఈవెంట్స్ కి వెళ్లారట. యూఎస్‌ వెళ్లినప్పుడు జరిగిన సంఘటన చెబుతూ, వేణు అన్నని తీసుకెళ్తే ప్రిన్సిపల్‌ని సంకన పెట్టుకుని తీసుకెళ్లినట్టే అని చెప్పాడు. అది చేయోద్దు, ఇది చేయోద్దని, అక్కడికి వెళ్లొద్దు, ఇక్కడికి వెళ్లోద్దంటూ కండీషన్స్ పెడతాడని చెప్పాడు. 
 

ఇక్కడ సుడిగాలి సుధీర్‌ ప్రస్తావన వచ్చింది. దీంతో ఆయన్ని శృంగార తార సన్నీలియోన్‌తో పోల్చాడు సుధీర్‌. ఆయనతో టూర్‌ వెళితే సన్నీలియోన్‌ని సంకన పెట్టుకున్నట్టే అని తెలిపారు. కుదురుగా ఉండలేడని, తమని ఉండనివ్వడని తెలిపారు. అంతేకాదు ఓ రష్యాన్‌ అమ్మాయితో గంటసేపు మాట్లాడి మ్యాటర్‌ సెట్‌ చేశాడంటూ అక్కడ జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చాడు అవినాష్‌. 
 

వేణు ప్రస్తావన ముగిసిన అనంతరం సుధీర్‌ గురించి చెబుతూ, సుధీర్‌ అన్నతో వెళితే సన్నీలియోన్‌ని సంకన పెట్టుకుని తీసుకెళ్లినట్టే అని షాకిచ్చాడు అవినాష్‌. `రేయ్‌ అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా.. రేయ్‌ ఎక్కడికైనా వెళ్దామా` అని అంటాడని, కుదురుగా ఉండలేడనే కోణంలో తెలిపారు అవినాష్‌. అంతేకాదు అమెరికాలో హోటల్‌లో రూమ్‌కి వెళ్లాక ఓ రష్యాన్ అమ్మాయి వచ్చి డోర్‌ కొట్టిందట. 
 

ఆమె తన రూమ్‌ ఇదే అనుకుని మా రూమ్‌కి వచ్చిందని, కానీ అది కాదని చెప్పడానికి తమకు తల ప్రాణం తోకకి వచ్చిందట. ఆమె ఇది మీ రూమ్‌ కాదని చెప్పడానికి రాత్రాంతా కష్టపడాల్సి వచ్చిందని, మార్నింగ్‌ పదిగంటల వరకు వాదన జరుగుతూనే ఉందని, ఆమె రష్యా భాష మాకు రావడం లేదని, మా భాష ఆమెకి అర్థం కావడం లేదని,మధ్యలో కొత్త భాష వస్తుందని చెప్పాడు అవినాష్‌. తర్వాత సుధీర్‌ పర్సనల్‌గా గంటసేపు మాట్లాడి ఆమెకి అర్థం అయ్యేలా చెప్పాడని తెలిపాడు అవినాష్. సుధీర్‌ అన్న లేకపోతే మేం ఏమైపోయేవాళ్లమో అంటూ ఎమోషన్స పండించాడు అవినాష్‌. దీంతో తన స్కిట్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. 
 

దీనిపై అనిల్‌ రావిపూడి స్పందిస్తూ, ఇది ఏ సర్టిఫికేట్‌ స్కిట్‌ అని, కానీ అవినాష్‌ యు సర్టిఫికేట్‌ కోటింగ్‌ వేసి చెప్పాడని, సేఫ్‌ గేమ్‌ ఆడాడని,తను సేఫ్‌ కానీ సుధీర్‌ని ఇరికించాడని తెలిపింది. పక్కనే ఉన్న దీపికా పిల్లి ఇవన్నీ వింటూ ఆశ్చర్యంతో కూడా నవ్వులు పూయిస్తూ ఆద్యంతం ఆకట్టుకుంది. 

Latest Videos

click me!