రోజా, ఆది, సుధీర్‌, వర్ష, ఇమ్మాన్యుయెల్‌ జబర్దస్త్ కమెడీయన్ల రెమ్యూనిరేషన్‌ ఎంతో తెలిస్తే మతిపోతుంది..

First Published | Jan 16, 2021, 8:17 AM IST

ప్రస్తుతం తెలుగు టీవీలో అత్యంత పాపులారిటీ పొందుతున్న షో `జబర్దస్త్`. కామెడీకి ఇది కేరాఫ్‌గా నిలుస్తుంది. జడ్జ్ లు, యాంకర్స్, కమెడీయన్లకు మధ్య మంచి కో ఆర్డినేషన్‌ ఉంటుంది. అయితే ఇందులో పాల్గొనే జడ్జ్ లు, యాంకర్లు, కమెడీయన్ల పారితోషికం మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందట. ఆ విషయం తెలిస్తే మతిపోతుందని చెప్పారు. ఆ వివరాలు మీ కోసం. 
 

`జబర్దస్త్` ఈటీవీలో ప్రారమవుతున్న కామెడీ షోస్‌. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే రెండు రకాలుగా ఈ షోస్‌ ప్రసారమవుతుంటాయి. జబర్దస్త్ కి అనసూయ హోస్ట్ గా ఉంటే, ఎక్స్ ట్రా జబర్దస్త్ కి రష్మి హోస్ట్.
గతంలో నాగబాబు, రోజా జడ్డ్ లుగా ఉండేవారు. ఇప్పుడు రోజా, మనో జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. నాగబాబు జీ తెలుగులోకి ఇదే తరహాలో రన్‌ చేసే `బొమ్మ అదిరింది` షో కోసం వెళ్లారు.

మల్లెమాల నిర్వహణలో సాగే ఈ కామెడీ షోస్‌..ప్రతి గురువారం, శుక్రవారం జబర్థస్త్, ఎక్స్‌ట్రా జబర్థస్త్ రూపంలో ఆడియెన్స్ ఎంటర్‌టైన్‌ చేస్తుంటాయి. వీటికోసం టీవీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిఠ్‌ చేస్తుంటారు. ఈ షోలను టీవీలో కంటే యూట్యూబ్‌లోనే లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్‌కు మధ్యలో తాత్కాలిక బ్రేక్ వచ్చింది. లాక్‌డౌన్ సడలింపులు తర్వాత జబర్దస్త్ మరోసారి టీవీల్లో సత్తా చాటుతూనే ఉంది. లాక్‌డౌన్ తర్వాత టీఆర్పీల విషయంలో కాస్త వెనకబడ్డ.. ఇప్పుడు అదే దూకుడుతో ముందుకు సాగుతుంది. మరింతగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది.
అయితే ఈ షోపై గతంలో చాలా విమర్శలు వచ్చాయి. డబుల్‌ మీనింగ్‌ డైలాగులే ఎక్కువ అని, బూతుల ప్రోగ్రామ్‌ అనే కామెంట్స్ బాగా వినిపించాయి. ఒకానొక దశలో దీన్ని బ్యాన్‌ చేయాలనే నినాదం కూడా వినిపించింది. కానీ అవేమీ ఈ షో క్రేజ్‌ని తగ్గించలేకపోయాయి. ఇప్పుడు జబర్దస్త్ కోసం విమర్శించిన వారే చూసేపరిస్థితి వచ్చింది.
ఇదిలా ఉంటే ఇందులో పాల్గొనే వారి రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే ఉందని తెలుస్తుంది.తాజా సమాచారం మేరకు జడ్జ్ లు, యాంకర్స్, కమెడీయన్ల వరకు అందరూ లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఆ వివరాలు చూస్తే..
జబర్దస్త్ జడ్జ్ గా ఉన్న రోజా నెలకు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల పారితోషికంగా తీసుకుంటున్నట్టు టాక్‌. అలాగే మనోకి రోజాలో సగం అంటే పది లక్షల మాత్రమే ఇస్తున్నారట. గతంలో నాగబాబుకి ఇరవై లక్షలకుపైనే ఉండేదని సమాచారం.
ఈ షోస్‌లో యాంకర్స్ కి స్పెషల్‌ క్రేజ్‌ఉంటుంది. అందాల ముద్దుగుమ్మలు అనసూయ, రష్మి తన గ్లామర్‌తో, టాలెంట్‌తో షోని మరింతగా రక్తికట్టిస్తుంటారు. అందుకే వీరికి స్పెషల్‌ రెమ్యూనరేషన్‌ ఉంటుందట. వీరిద్దరికి దాదాపుగా ఐదు లక్షలు నెలకు పారితోషికం అందుకుంటున్నట్టు టాక్.
షోలో టీమ్‌లీడర్స్ అయిన హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌, చమ్మక్‌చంద్రలు సైతం భారీగానే తీసుకుంటున్నట్టు టాక్‌. వీరిలో చమ్మక్‌ చంద్రకి అందరి కంటే ఎక్కువగా నాలుగు లక్షలు నెలకు పారితోషికంగా పొందుతున్నారట. ఆ తర్వాత సుడిగాలి సుధీర్‌కి రూ.3.5లక్షలు, పంచ్‌లమాస్టర్‌ హైపర్‌ ఆదికి మూడు లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్‌, రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలకు రెండున్నర లక్షలు ఇస్తున్నారని, బుల్లెట్ భాస్కర్ కి రెండు లక్షలు, వర్ష, ఇమ్మాన్యుయెల్‌, కెవ్వు కార్తిక్‌ వంటి కొత్త వారికి దాదాపు లక్షల రూపాయలకు వారి రేంజ్‌ని బట్టి ఇస్తున్నారని టాక్‌. మరోవైపు జబర్దస్త్ కమెడీయన్లకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ, మరోవైపు జబర్దస్త్ షో చేస్తూ మంచి పేరుని, డబ్బుని సంపాదిస్తున్నారు. ఈ షో చాలా మంది కమెడీయన్లకి లైఫ్‌ ఇస్తుందనేది నిజం.

Latest Videos

click me!