వర్షిణి హ్యాండిచ్చినట్టేనా?.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న హైపర్‌ ఆది.. అమ్మాయి ఎవరంటే ?

First Published | Jan 23, 2021, 6:52 PM IST

`జబర్దస్త్` షోతో పాపులర్‌ అయిన హైపర్‌ ఆది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడా? `ఢీ` వర్షిణితో పులిహోర కలిపిన ఆది ఇప్పుడు పెద్దలు కుదిర్చిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. షోస్‌లో తన ఆశలు పెట్టుకున్న వాళంతా హ్యాండివ్వడంతో ఇప్పుడు అరెంజ్‌ మ్యారేజ్‌కి సిద్ధమవుతున్నట్టు టాక్‌. 

`హైపర్‌` ఆది.. ఈటీవీలో వచ్చే `జబర్దస్త్` షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆయన పంచ్‌లకు మంచి క్రేజ్‌ వచ్చింది. స్కిట్‌ రైటర్‌గా ఉన్న ఆది.. క్రమంగా ఎదుగుతూ వస్తూ టీమ్‌ లీడర్‌గా ఎదిగారు.
టీమ్‌ లీడర్‌గానే కాదు, కొన్ని షోలకు తనే హోస్ట్ గా వ్యవహరించారు. యాంకర్‌గానూ రాణిస్తున్నారు. టీవీ ఇండస్ట్రీతోపాటు.. సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. ఆయన కమెడీయన్‌గా బాగానే సినిమాలు చేస్తున్నారు.

ఓ వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోస్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. టీవీ కమెడీయన్స్‌ లో మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు ఆది.
అయితే ఇటీవల హైపర్‌ ఆది పులిహోర కలపడం స్టార్ట్ చేశారు. అడపాదడపా అనసూయతో చనువుగా ఉంటూ ఆమెతోనే పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు.
కానీ ఇటీవల చాలా సిన్సియర్‌గా `ఢీ` వర్షిణితో కెమిస్ట్రీ పండిస్తున్నాడు. ఆమెతో కామెడీ పండిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అదే సమయంలో వర్షిణి కూడా ఆదికి బాగానే రెస్పాండ్‌ అవుతుంది.
దీంతో సుడిగాలి సుధీర్‌కి, రష్మీకి దీటుగా హైపర్‌ ఆది, వర్షిణిల జోడి ఎదుగుతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు బాగా పండుతున్నాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది.
కానీ ఇటీవల `అలీతో సరదాగా` షోలో వర్షిణి తనకు పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. లవ్‌కి ఓకే అని క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా తమ లాంటి మంచి వాళ్లు కూడా ఉంటారని చెప్పాడు ఆది. కానీ ఏ లాభం మ్యారేజ్‌ చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది.
ఈ నేపథ్యంలో హైపర్‌ ఆది మ్యారేజ్‌కి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో గుప్పుమనడం విశేషం. ఆది పేరెంట్స్ ప్రకాశం జిల్లాకి చెందిన ఓ అమ్మాయిని చూశారని, బాగా తెలిసిన అమ్మాయి అని తెలుస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లికే ఆది గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. అంతేకాదు త్వరలోనే వీరి పెళ్లి జరగబోతుందనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి దీనిపై ఆది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Latest Videos

click me!