భర్తతో విబేధాలు, విడాకుల ఆలోచనలో కలర్స్ స్వాతి... ఇదిగో ప్రూఫ్ అంటూ కథనాలు!

First Published | Jul 18, 2023, 10:12 AM IST

హీరోయిన్ కలర్స్ స్వాతి భర్తతో విడిపోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆమె తన సోషల్ మీడియా ద్వారా దీనిపై హింట్ ఇచ్చారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. 
 

Swathi Reddy

సోషల్ మీడియా ఒకరి వ్యక్తిగత జీవితం, వాళ్ళ మూడ్, మూమెంట్స్ అన్నీ చెప్పేస్తుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు సోషల్ మీడియా వేదికగా స్పందించడం జనాలకు అలవాటుగా మారిపోయింది. ఈ మధ్య విడాకులు తీసుకునే జంటలు సోషల్ మీడియా ద్వారా ఓ హింట్ ఇస్తున్నారు. సమంత, నిహారిక, శ్రీజా ఇదే చేశారు. 

సమంత తన పేరు నుండి అక్కినేని అనే ఇంటి పేరు తొలగించింది. దాంతో నాగ చైతన్యతో విడాకుల వార్తలకు బీజం పడింది. కథనాలు మొదలైన కొన్ని నెలల తర్వాత అధికారికంగా ప్రకటించారు. నిహారిక సైతం ఇదే ట్రెండ్ ఫాలో అయ్యింది. అయితే నిహారిక కంటే ముందు భర్త వెంకట చైతన్య హింట్ ఇచ్చాడు. 


Swathi Reddi

వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడు. అనంతరం కొద్ది రోజులకు నిహారిక కూడా డిలీట్ చేసింది. విడాకుల ఊహాగానాలు మధ్య ఇటీవల అధికారిక సమాచారం అందింది. వాళ్ళు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు అప్లై చేసుకున్నారు. అలాగే చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజా ఇంస్టాగ్రామ్ నుండి భర్త కళ్యాణ్ దేవ్ పేరు తీసేసారు. ప్రస్తుతం వారు విడివిడిగా ఉంటున్నారు. 

ఇదే తరహాలో కలర్స్ స్వాతి విడాకులపై హింట్ ఇచ్చారనే ప్రచారం మొదలైంది. స్వాతి ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. ఈ క్రమంలో ఆమెకు భర్తతో విబేధాలు తలెత్తాయని చర్చ నడుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. 

స్వాతి 2018లో తన ప్రియుడు వికాస్ వాసును పెళ్లి చేసుకుంది. వికాస్ వాసు పైలట్ కాగా వివాహం అనంతరం విదేశాల్లో సెటిల్ అయ్యింది. గత ఏడాది స్వాతి కమ్ బ్యాక్ ప్రకటించింది. పంచతంత్రం టైటిల్ తో ఒక మూవీ చేసింది. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తుంది. 

కెరీర్ మీద ఫోకస్ పెట్టిన స్వాతి భర్తకు దూరంగా ఇండియాలోనే ఉంటున్నారని సమాచారం. కలర్స్ ప్రోగ్రాంతో  యాంకర్ గా ఫేమస్ అయిన స్వాతి డేంజర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. 
 

Latest Videos

click me!