పెళ్లి కోసం చిరంజీవి కి మామ పెట్టిన పరీక్ష... డిస్టింక్షన్ లో లో పాసైన మెగాస్టార్

First Published | Aug 21, 2023, 3:35 PM IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే  వీరి పెళ్లి వెనుక జరిగిన కథ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
 

మొగల్తూరు వాసి కొణిదెల శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా చిరు ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతో మందికి స్ఫూర్తిగా మారిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనను ఆధారంగా చేసుకొని మెగా కాపౌండ్ నుంచి యంగ్ స్టార్స్ వస్తున్న విషయం విధితమే. అయితే ఇంతటి సక్సెస్ చూసిన చిరు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
 

ఆ ఆస్తికరమైన విషయం మరేంటో కాదు.. Chiranjeevi Marriage వెనకల జరిగిన కథనే.  మెగాస్టార్ చిరంజీవి - సురేఖల పెళ్లికి ముందు చిరు గురించి సీనియర్ కమెడియన్, దివంగత అల్లు రామలింగయ్య ఎలా ఆరా తీశారో చాలా మందికి తెలిసి ఉండదు. తాజాగా ఆ స్టోరీ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కథేంటో చూద్దాం. 
 

Latest Videos


1978లో చిరంజీవి కెరీర్ ‘పునాదిరాళ్లు’ చిత్రంతో ప్రారంభమైంది. కానీ ముందు ‘ప్రాణం ఖరీదు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటుడిగా తనకంటూ గుర్తింపు సాధించాలనే తాపత్రయంలో ఉన్నారు. అదే సమయంలో చిరు వ్యక్తిత్వం, ప్రవర్తనను అల్లు రామలింగయ్య (Allu Rama Lingaiah)  గమనించడం ప్రారంభించారంట.
 

అల్లు రామలింగయ్య కూతురు సురేఖ (Surekha)కు పెళ్లి చేయాలని చూస్తున్న సమయంలోనే చిరంజీవి ఆయన కంట్లో పడటం.. ఆయన గురించి ఆరా తీయటం మొదలు పెట్టారంట. 
భవిష్యత్ లో చిరంజీవి సెన్సేషన్ గా మారుతారని అల్లు రామలింగయ్య బలంగా నమ్మాడు. అందుకే తన కూతురితో వివాహం జరిపించి చిరును అల్లుడిగా మార్చేసుకున్నారు. పెళ్లికి ముందు చిరు గుణగణాలను ఇలా తెలుసుకున్నారంట.

‘మనవూరి పాండవులు’ చిత్రంలో చిరంజీవి ఐదుగురు కుర్రాళ్లలో ఒకరిగా, విలన్ రావు గోపాల్ మేనలుడి పాత్రలో నటించారు. రావు గోపాల్ పక్కన అల్లు రామలింగయ్య అసిస్టెంట్ కనకయ్య పాత్రను పోషించారు. ఆ సమయంలోనే చిరును అల్లు రామలింగయ్య చూశారంట. ఆయన నటన, గుణగణాలు, వ్యక్తిత్వాన్ని గమనించారు. 
 

ఓ సందర్భంలో రామలింగయ్య మందు తాగుతూ చిరును నువ్వు కూడా తీర్థం పుచ్చుకో అని అడిగారంట. దానికి చిరు నాకలాంటి అలవాట్లు లేవండి.. నేను ఆంజనేయ భక్తుడ్ని అని బదులిచ్చారంట. రామలింగయ్య నవ్వుకుని ఆ అలవాట్లకు మెచ్చుకున్నారంట. ఆ తర్వాత చిరును అల్లు రామలింగయ్య భార్య కూడా గమనించారంట. 
 

అల్లు రామలింగయ్య ఇంట్లో ఉండే స్నేహితుడైన సత్యనారాయణను కలిసేందుకు చిరంజీవి అప్పుడప్పుడు వెళ్లేవారు. అదే సమయంలో అల్లు రామలింగయ్య భార్య చిరు బుద్ధి, ప్రవర్తను గనమించి ఆయనతో చెప్పిందంట. అప్పుడే వారి కూతురును చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారంట. దాంతో సత్యనారాయణను కూడా ఎంక్వైరీ చేయగా చక్కటి వాడని చెప్పారంట.

ఆ తర్వాత కొడుకు అరవింద్ ను కూడా చిరంజీవి గురించి పూర్తి విషయాలు తెలుసుకోమని చెప్పారంట. సరైన వాడని తెలుసుకొని చిరును అల్లుడిగా ఫైనల్ చేశారు. ఆ వెంటనే చిరు, అల్లు రామలింగయ్యకు కామన్ ఫ్రెండ్ అయిన జయకృష్ణ ద్వారా ఇరు కుటుంబాలు పెళ్లి విషయాలను మాట్లాడరు. అన్నీ కుదుర్చుకున్నారు. 
 

అంతే కాదు.. అప్పటికే సురేఖ కూడా చిరంజీవిని ‘మనవూరి పాండవులు’ మూవీ ప్రివ్యూ వేసినప్పుడు, తయారమ్మ బంగారయ్య శతదినోత్సవ వేడుకల్లో చూసింది. దాంతో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. 1980 ఫిబ్రవరి 20న ఉదయం 10 :04 గంటలకు మద్రాసులో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే, ఇదే విషయాన్ని చిరు కూడా ‘అల్లు స్టూడియో’ ప్రారంభోత్సవంలో చెప్పడం విశేషం. 
 

పెళ్లి జరిగిన వేళావిషమేంటో గానీ.. ఆ తర్వాత చిరంజీవి కెరీర్ లో అంతకంతూ ఎదుగుతూ వచ్చారు. నటనరంగంలో సంచలనాలు సృష్టించారు. మెగాస్టార్ గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. 150 సినిమాలకు పైగా సినిమాలు చేసిన చిరు.. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. చివరిగా ‘భోళా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

click me!