పరాజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రంలో రాంచరణ్ దాదాపు 40 నిమిషాల నిడివి ఉన్న పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్నారు. చిరంజీవి, నాగబాబు తర్వాత ఇద్దరు మెగా హీరోలు కలిసి నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రం ఇదే అని చెప్పాలి.