కర్నాటక మ్యూజికల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఇంద్రజ. ఆమె చిన్పప్పుడే క్లాసికల్ సింగింగ్, డాన్సింగ్ నేర్చుకుంది. కుచిపూడి డాన్సు నేర్చుకుంది. రజనీకాంత్ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో `యమలీల` మూవీ ఎంతటి విజయాన్ని అందించిందో తెలిసిందే. ఆమె బ్రేక్ ఇచ్చింది. `సోగసు చూడతరమా`, `అమ్మ దొంగ`, `వజ్రం`, `జగదేక వీరుడు`, `ఒక చిన్న మాట`, `చిలక్కొట్టుడు`, `పెద్దన్నయ్య` వంటి సినిమాలు చేసింది. ఇటీవల నటిగా మళ్లీ బిజీ అవుతుంది.