విజయ్
‘తలపతి’ విజయ్ కోలీవుడ్ టాప్ స్టార్. హీరో విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించి, తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయ్ సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి, రాష్ట్ర రాజకీయ రంగంలో గణనీయమైన మార్పు తీసుకురావడానికి తన పాపులారిటీని ఉపయోగించుకోవాలని విజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయ్ పొలిటికల్ జర్నీ ఇప్పుడే మొదలైంది అతడు సక్సెసా లేక ఫెయిల్యూరా అనేది ఇప్పుడే చెప్పలేం..
స్మృతి ఇరానీ
“క్యోంకీ సాస్ భీ కభీ బహు తీ” సీరియల్ లో స్మృతి ఇరానీ చేసిన పాత్ర ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. టెలివిజన్ నుండి రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ, టెక్స్టైల్ మినిస్టర్ గా బాధ్యతలు నెరవేర్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. అయితే బీజేపీ పార్టీలో యాక్టీవ్ పొలిటీషియన్ గా ఉంది.
కమల్ హాసన్
లోకనాయకుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (MNM) అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. తమిళనాడులో తన పార్టీ ద్వారా సామాజిక న్యాయం, సంస్కరణలపై దృష్టి సారించారు. రాజకీయంగా కమల్ హాసన్ ఫెయిల్ అయ్యారు. ఆయన పార్టీ 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. కమల్ సైతం ఓడిపోయారు.
రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ 2017లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని తెలియజేశారు. అనూహ్యంగా రజినీకాంత్ శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అభిమానులు ఆందోళనలు చేసినా నిర్ణయం మార్చుకోలేదు.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి 2008లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పెద్దగా ప్రభావం చూపలేదు. దాంతో చిరంజీవి పీఆర్పీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నెరవేర్చారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.