Uday Kiran-Rajamouli: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి ఆ సినిమా చేసుంటే... నేడు ఆయన మన మధ్య ఉండేవారా!

Published : Jun 17, 2022, 06:47 PM ISTUpdated : Jun 17, 2022, 06:49 PM IST

ఉదయ్ కిరణ్ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద కుదుపు. ఓ యంగ్ హీరో జీవితం ముగిసిన తీరు అందరినీ మానసిక వేదనకు గురి చేసింది. సక్సెస్ ఫుల్ హీరోగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఉదయ్ కిరణ్ ఆఫర్స్ రాకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.   

PREV
16
Uday Kiran-Rajamouli: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి ఆ సినిమా చేసుంటే... నేడు ఆయన మన మధ్య ఉండేవారా!
Rajamouli - uday kiran


2014 జనవరి 14న ఉదయ్ కిరణ్ హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే రాజమౌళితో చేయాల్సిన ఓ మూవీ ఉదయ్ కిరణ్ చేసుంటే ఆయనకు ఆ పరిస్థితి వచ్చేది కాదనే ఓ వాదన ఉంది. ఆ స్టోరీ ఏమిటో చూద్దాం... 

26

స్టూడెంట్ నంబర్ వన్ తో సూపర్ హిట్ అందుకున్న రాజమౌళి సింహాద్రి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. మూడో చిత్రంగా ఆయన కాలేజీ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు. స్టూడెంట్స్ గ్రూప్ గొడవలు, మాఫీయా పై తిరుగుబాటు సై మూవీ కథ. నితిన్ హీరోగా నటించిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా నితిన్ కి మాస్ ఇమేజ్ తేవడంతో పాటు కెరీర్ కి ప్లస్ అయ్యింది. 
 

36


అయితే సై చిత్రానికి రాజమౌళి అనుకున్న హీరో ఉదయ్ కిరణ్ అట. ఈ మూవీ ఉదయ్ కిరణ్ చేయాల్సి ఉండగా అనుకోని కారణాలతో  ఛాన్స్ నితిన్ కి దక్కింది. 2001లో విడుదలైన మనసంతా నువ్వే తో భారీ విజయం నమోదు చేసిన ఉదయ్ కిరణ్ కి వరుసగా యావరేజ్లు, ప్లాప్స్ పడ్డాయి. 

46


సై విడుదలయ్యే నాటికి ఉదయ్ కిరణ్ కెరీర్ గ్రాఫ్ పడిపోవడం స్టార్ట్ అయ్యింది. ఆ సమయంలో రాజమౌళి అనుకున్నట్లుగా ఉదయ్ కిరణ్ తో సై చిత్రం చేసి ఉంటే... ఉదయ్ ఖాతాలో మంచి హిట్ పడేది. ఆయన కమ్ బ్యాక్ కావడానికి ఆస్కారం దక్కేది. 2004లో విడుదలైన లవ్ టుడే అట్టర్ ప్లాప్ కాగా... అనంతరం చేసిన ఔనన్నా కాదన్నా, వియ్యాల వారి కయ్యాలు, గుండె ఝల్లుమంది వరుసగా ప్లాప్ అయ్యాయి. 
 

56
uday kiran

uday kiranదీంతో ఉదయ్ కిరణ్ కి ఆఫర్స్ తగ్గాయి. ఈ క్రమంలో కొన్ని తమిళ చిత్రాలు చేశారు. 2011లో ఉదయ్ కిరణ్ నటించిన ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. 2012 లో నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా, 2013లో జై శ్రీరామ్ చిత్రాలు చేశారు. ఇక ఉదయ్ మరణించే నాటికి సెట్స్ పై ఉన్న మూవీ.. చిత్రం చెప్పిన కథ. విచిత్రంగా ఉదయ్ కిరణ్ కెరీర్ చిత్రం మూవీతో మొదలై చిత్రం చెప్పిన కథతో ముగిసింది. 

66
\

సక్సెస్ఫుల్ హీరోగా ఉన్నపుడు ఆయన అనుభవించిన గౌరవం స్టేటస్ తర్వాత పోయాయి. ఆఫర్స్ లేకపోవడంతో ఒకింత ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు... ఇవన్నీ సున్నిత మనస్కుడైన ఉదయ్ కిరణ్ జీర్ణించుకోలేకపోయారు. మానసిక వేదనతో తనువు చాలించాడు.

Read more Photos on
click me!

Recommended Stories