Hyper Aadi: రోజా బాటలో హైపర్ ఆది.. జబర్దస్త్ కి గుడ్ బై, అసలేం జరిగింది ?

Published : Apr 17, 2022, 05:31 PM IST

తన కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది గత మూడు వారాలుగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. దీనితో హైపర్ ఆది జబర్డస్త్ కి శాశ్వతంగా దూరం అవుతున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి.

PREV
16
Hyper Aadi: రోజా బాటలో హైపర్ ఆది.. జబర్దస్త్ కి గుడ్ బై, అసలేం జరిగింది ?
Hyper Aadi

దాదాపు గత పదేళ్లుగా నటి రోజా జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగుతున్నారు. ఆమె ఎమ్మెల్యే అయ్యాక కూడా జబర్దస్త్ ని వదిలి పెట్టలేదు. జబర్దస్త్ కి నాగబాబు దూరమైనప్పటికీ రోజా కొసాగుతూ వచ్చారు. కానీ ఇటీవల రోజా కూడా జబర్దస్త్ కి దూరం అయ్యారు. అందుకు కారణం లేకపోలేదు. 

 

26
Hyper Aadi

వైసిపిలో రోజా రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లోనే ఆమెకు మంత్రి పదవి వస్తుందనే అంచనాలు వినిపించాయి. కానీ రోజాకి మంత్రి పదవి దక్కలేదు. ఎట్టకేలకు ఆమె నిరీక్షణ ఫలించింది. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల చేసిన మంత్రి వర్గ విస్తరణలో రోజాకు కూడా మంత్రి పదవి లభించింది. దీనితో రోజా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పక తప్పలేదు. 

36
Hyper Aadi

ఏళ్ల తరబడి జబర్డస్త్ కి జడ్జీలుగా వ్యవహరించిన నాగబాబు, రోజా ద్వయం జబర్దస్త్ నుంచి కనుమరుగయ్యారు. జబర్దస్త్ కమెడియన్లు కూడా కొత్త వారు వస్తున్నారు. ఇదిలా ఉండగా తన కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది గత మూడు వారాలుగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. 

46
Hyper Aadi

దీనితో హైపర్ ఆది జబర్డస్త్ కి శాశ్వతంగా దూరం అవుతున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులు, అదిరిపోయే పంచ్ లతో జబర్దస్త్ ప్రధాన కమెడియన్స్ లో ఒకరిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ నుంచి తీసుకున్న గ్యాప్ టెంపరరీ మాత్రమేనా లేక శాశ్వతంగా ఈ షోకి దూరం అవుతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. 

56
Hyper Aadi

ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ షో చేస్తూనే.. అవకాశం వచ్చిన చిత్రాల్లో నటిస్తున్నాడు. జబర్దస్త్ షోలో హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై పలు సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. కానీ ఆది అవేమి పట్టించుకోలేదు. 

66
Hyper Aadi

హైపర్ ఆది జబర్దస్త్ షో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలలో కనిపిస్తున్నాడు. ఆది రీసెంట్ గా భీమ్లా నాయక్ చిత్రంలో మెరిసాడు.  

click me!

Recommended Stories