రాశీఖన్నా గ్లామర్‌ డోస్‌ పెంచింది..ఎద అందాలతో కైపెక్కిస్తుంది!(బర్త్‌ డే స్పెషల్‌)

First Published | Nov 30, 2020, 12:44 PM IST

ఇటీవల డేటింగ్‌కి రెడీ అని చెప్పి తన అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసిన రాశీఖన్నా.. ఇప్పుడు సినిమా ఛాన్స్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. గ్లామర్‌ పాత్రలతోపాటు కాస్త ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తూ అలరిస్తున్న ఈ బొద్దుగుమ్మ నేడు(సోమవారం) బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెపై ఓ లుక్కేద్దాం. 
 

1990, నవంబర్‌ 30న జన్మించిన ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా.. అక్కడే ఉన్నత విద్య పూర్తి చేసి సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఈ బొద్దుగుమ్మ మొదట పలు కమర్షియల్‌ యాడ్స్ తో మెస్మరైజ్‌ చేసింది. అందరి చూపుని తనవైపు తిప్పుకుంది.

`మద్రాస్‌ కేఫ్‌` అనే హిందీ చిత్రంతో నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో సెటిల్‌ అయిపోయింది.
హైదరాబాద్‌లోనే ఇళ్ళు కొనుకున్ని ఫ్యామిలీని కూడా హైదరాబాద్‌కే షిఫ్ట్ చేసిందీ అమ్మడు. తెలుగు, తమిళ సినిమాలతో స్టార్‌ హీరయిన్‌గా రాణిస్తుంది.
2014లో `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్‌ భామ `జోరు`, `జిల్‌` చిత్రాలతో విజయాలను అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
గ్లామర్‌ పాత్రలతో మెప్పించిన రాశీఖన్నా.. ఈ మధ్య కమర్షియల్‌ చిత్రాల్లో కూడా తన పాత్రకి కొద్దిగానైనా ప్రయారిటీ ఉండేలా చూసుకుంటోంది. `సుప్రీమ్‌`, `హైపర్‌`, `జై లవకుశ`, `వెంకీమామ`, `ప్రతి రోజు పండుగే` చిత్రాలతో మెరిసింది.
గతేడాది వచ్చిన `వెంకీమామ`, `ప్రతి రోజు పండగే` చిత్రాలు యావరేజ్‌ విజయాలను అందించాయి. కానీ రాశీకి పెద్దగా పేరు రాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో విజయ్‌ దేవరకొండ `వరల్డ్ ఫేమస్‌ లవర్‌` చిత్రంలో మెరిసిన రాశీ..తమిళంలో `అరణ్మనై 3` చిత్రంలో నటిస్తుంది.
దీంతో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు మరే సినిమాకి సైన్‌ చేయలేదు. తమిళంలో మాత్రం విజయ్‌ సేతుపతితో కలిసి `తుగ్లక్‌` సినిమాలో రొమాన్స్ చేయబోతుంది.
ఈ క్రమంలో ఓ బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది రాశీఖన్నా. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రకటనతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. తాను ఇప్పటి వరకు సింగిలే అని పేర్కొంది.
ఇంతటితో ఆగలేదు. అభిమానులకు బంపర్‌ ఆఫర్‌ అనౌన్స్ చేసింది. ఓ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రేమలో పడలేదని తెలిపింది. తన మనసులో ఎవరూ లేరని, సింగిల్‌గానే ఉన్నానని తెలిపింది.
ఎవరితోనైనా ప్రేమలో పడితే డేటింగ్‌ చేసేందుకు రెడీ అని తెలిపింది. తన లైఫ్‌లో స్పెషల్‌ పర్సన్‌ కోసం వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఇలా బోల్డ్ స్టేట్‌మెంట్‌తో వార్తల్లో నిలిచిందీ అమ్మడు.
అయితే ఇటీవల కాలంలో రాశీఖన్నా గ్లామర్‌ డోస్‌ పెంచింది. ఎద అందాలను ఎరగా వేస్తుంది. అభిమానులను మెస్మరైజ్‌ చేస్తుంది. ప్రత్యేక ఫోటో షూట్‌లతో అలరిస్తుంది.
ఇదిలా ఉంటే ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా పొల్లాచిలో రెడ్‌ కలర్‌ శారీలో మెరిసింది.
పచ్చని పైర్లు, వెనకాల కొబ్బరి తోట, వరదగా పారుతున్న నీళ్ళు వెనకాల కనువిందుగా ఉండగా, బ్రిడ్జ్ పై రాశీ ఫోటోలకు పోజులిచ్చింది. ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Latest Videos

click me!