హనీరోజ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. బిల్లు గట్టిగానే వేస్తుందట..?

First Published | Aug 13, 2023, 3:35 PM IST

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది హనీ రోజు. తన అందంతో అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో కూడా  దడదడలాడిస్తోంది. 
 

ఒక్కటే ఒక్క సినిమా టాలీవుడ్ లో హీనీరోజ్ కు క్రేజ్ ను తీసుకువచ్చింది. బాలయ్య హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది బ్యూటీ. ఏమంటా మలయాళం నుంచి హనీరోజ్ ను తీసుకువచ్చారో.. ఆడియన్స్ చూపంతా ఆమె మీదే పడింది. బయటకి వచ్చిన తరువాత ఎవరీ హనీరోజ్ అంటూ వెతరకడం మొదలు పెట్టారు. 
 

Honey Rose

వీర సింహారెడ్డి మూవీలో హాని రోజ్ ప్రదర్శించిన పెర్ఫార్మెన్స్ కి ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడు. ఆ మూవీలో బాలకృష్ణకి లవర్ గా, తల్లిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో సూపర్ గా నటించింది. ముఖ్యంగా యంగ్ వయసు క్యారెక్టర్ లోని హనీ అందం కుర్రకారు ని గిలిగింతలు పెట్టింది.


ఈసినిమా తరువాత హనీకి చాలా క్రేజ్ వచ్చింది. కాని టాలీవుడ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. ఎందుకో తెలియదు.. మళ్లీ సినిమాలు లేకపోవడంతో.. ఆమె అంటే క్రేజ్ ఉన్న అభిమానులు సోషల్ మీడియాలో హనీని ఫాలో అవువ్వడం స్టార్ట్ చేశారు. నెట్టింట పాల సొగసులతో ఆమె అందాల ఆరబోతను ఆస్వాదిస్తున్నారు. 
 

కుర్ర  కారులో ఆమెకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. హనీరోజ్ గ్లామర్ ట్రీట్ కు... కళ్లప్పగించి చూసేవారు చాలా మంది ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆమె ఫోటోలు పెడుతుందా అని క్లిక్ చేసేవారి సంఖ్య  పెరుగిపోతుంది. అదే ఆమెకు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ను తీసుకుని వచ్చింది.
 

ఇక ఆసినిమా ప్రభావం.. సోషల్ మీడియా క్రేజ్ తో.. హనీరోక్ కు ఓపెనింగ్స్ ఎక్కువైపోయాయి.. ముఖ్యంగా పెద్ద పెద్ద మాల్స్, జువ్వల్లరీస్.. తో పాటు.. ఇతర కార్యక్రమాలకు ఆమెను ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు. హనీవస్తోంది ఓపెనింగ్ కు అంటే.. జనాలు తండోప తండాలుగా వస్తున్నారట మరి. ఆక్రేజ్ ను బాగా ఉపయోగించుకుంటున్నారు వ్యాపారస్తులు. 

ఇక తనక్రేజ్ ను హనీ రోజ్ కూడా బాగానే క్యాష్ చేసుకుంటుందని సమామాచారం. హానీ రోజ్ తాజాగా తీసుకుంటున్న రెమ్యూనరేషన్  గురించి ఒక వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  హనీ రోజ్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే అక్షరాలా రూ.60 లక్షలు తీసుకుంటుందని సమాచారం. 

ఇక ముందుగా చెప్పుకున్నట్టు.. ఆమెకు ఉన్న క్రుజ్ ను దృష్టి పెట్టుకుని నిర్వాహకులు కూడా హనీ రోజ్ కు అంత మొత్తం ఇవ్వడానికి వెనుకాడటం లేదని టాక్.  మొత్తానికి వెనకట సామెత చెప్పినట్టు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది హనీరోజ్. తనకు క్రేజ్ వచ్చినప్పుడు.. అది ఉన్నంత వరకూ.. ఉపయోగించుకోవాలి అని డిసైడ్ అయినట్టుంది మలయాళ బ్యూటీ. 

Latest Videos

click me!