అందుకే నటీమణులు అందంగా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అందంగా కనిపించడం కోసం జిమ్ కసరత్తులు, డైట్ లు పాటించే హీరోయిన్ల కష్టం వర్ణనాతీతం. పోటీని తట్టుకునేందుకు మరింత అందంగా.. ట్రెండీగా కనిపించేందుకు హీరోయిన్లు సర్జరీ చేయించుకొవడం కూడా చూస్తున్నాం. ఈ సర్జరీలు అంత సులువు కాదు. ఏమాత్రం తేడా జరిగిన కెరీర్ మొత్తం పాడవుతుంది. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి.