టాలీవుడ్ లో ఫుల్ బిజీగా శ్రీలీలా.. యంగ్ బ్యూటీ ఎన్ని సినిమాలు చేస్తుందో తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే...

First Published | Apr 16, 2023, 12:04 PM IST

యంగ్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్లో దుమ్ము లేపుతుంది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వరుసగా హిట్స్ అందుకుంటున్న ఈ భామ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.
 

హైదరాబాద్ కు చెందిన యంగ్ హీరోయిన్ శ్రీలీలా(Sreeleela) యంగ్ హీరో రోషన్ సరసన 'పెళ్లి సందD'లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే నటనపరంగా, అందం పరంగా, డాన్స్ పరంగాను అదరగొట్టింది. ఆడియన్స్ నుంచి నూటికి నూరు మార్కులు దక్కించుకుంది. దాంతో ఆఫర్లు శ్రీలీలను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏకంగా 8 ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. 
 

శ్రీలీలా నటిస్తున్న భారీ ప్రాజెక్టులలో ఎస్ఎస్ఎంబి28 (SSMB28) ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక శ్రీలీలా కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇప్పటికే షూటింగ్ లోనూ జాయిన్ అయింది. చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.
 


'ధమాకా' బ్యూటీ నటిస్తున్న మరో భారీ చిత్రం NBK108. ఈ చిత్రం బాలకృష్ణ మరియు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ చిత్రంలోనూ శ్రీలీలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. షూటింగ్లోనూ సందడి చేసింది. చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మాత సాహూ గరపాటి, హరీష్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
 

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో 12 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. రీసెంట్ గా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రంలోని శ్రీలీలా నటిస్తుండటం విశేషం. ఇటీవల యంగ్ హీరోయిన్లకు అవకాశం ఇస్తున్న పవన్ శ్రీలీలకు కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు.

హిందీ హీరో నితిన్ - వక్కంతం వంశీ కాంబోలో 'nithiin32' రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీలా నితిన్ సరసన నటించబోతుంది. ఇప్పటికే చిత్రం పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని షూటింగ్ కి సిద్ధంగా ఉంది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై రూపుదిద్దుకొని ఉంది.

కుర్ర భామ శ్రీలీలా మరో క్రేజీ హీరో సరసన కూడా నటిస్తోంది. ఆయనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న BoyapatiRapo లో హీరోయిన్ గా ఈ బ్యూటీ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే సెట్లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఉగాది సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ దక్కింది.
 

జాతిరత్నాలు చిత్రంతో భారీ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఒకటి 'అనగనగా ఒకరాజు'.. రెండోది ' మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. కాగా శ్రీలీలా అనగా ఒకరాజు చిత్రంలో నవీన్ కు జంటగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. త్వరలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందే అవకాశం ఉంది. 
 

పంజా వైష్ణవ తేజ్ నటిస్తున్న నాలుగో చిత్రం #PVT04లోనూ శ్రీలీలా హీరోయిన్గా ఎంపికైంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. జోజు జార్జి విలన్ గా అల్లరించబోతున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న మరో చిత్రం Junior. ఈ చిత్రంలో కిరీటి సరసన శ్రీలీలా నటిస్తోంది. ఇలా ఏకంగా ఎనిమిది చిత్రాలు నటిస్తూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారిపోయింది.

Latest Videos

click me!