పెద్ద సినిమాలు రావాలంటే బెడ్ రూమ్ కి వెళ్లాల్సిందే... ఎన్టీఆర్ హీరోయిన్ పాయల్ సంచలన కామెంట్స్ 

Published : Jul 08, 2023, 03:09 PM IST

హీరోయిన్ పాయల్ ఘోష్ మీటూ ఆరోపణలతో పతాక శీర్షికలకు ఎక్కారు. 2020లో దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేశారు. మరోసారి ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.   

PREV
15
పెద్ద సినిమాలు రావాలంటే బెడ్ రూమ్ కి వెళ్లాల్సిందే... ఎన్టీఆర్ హీరోయిన్ పాయల్ సంచలన కామెంట్స్ 

పాయల్ ఘోష్ నటించిన లేటెస్ట్ మూవీ ఫైర్ ఆఫ్ లవ్ రెడ్. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న పాయల్ ఘోష్ మీటూ కామెంట్స్ చేశారు. నేను కొందరి పడకగదికి వెళ్లి ఉంటే ఇది నా 30వ చిత్రం అయ్యేది. పెద్ద సినిమాలు రావాలంటే బెడ్ షేర్ చేసుకోవాల్సిందే, అన్నారు.

25

పాయల్ ఘోష్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. దర్శకుడు అనురాగ్ కశ్యప్ 2013లో తనను హోటల్ లో రేప్ చేశాడని పాయల్ ఘోష్ 2020లో కేసు పెట్టారు. ఈ ఆరోపణలు అనురాగ్ ఖండించారు. ఆమె రేప్ చేశానని చెబుతున్న సమయంలో నేను ముంబైలోనే లేనని ఆయన ఆధారాలు చూపించాడు.

35

ఈ కేసులో అనురాగ్ విచారణ ఎదుర్కొన్నారు. పోలీసులు ఆయన్ని ప్రశ్నించారు. ఓ మూవీ ఆఫర్ విషయంలో చర్చలు అంటూ మూడో మీటింగ్ లో నన్ను రేప్ చేశాడని పాయల్ ఘోష్ ఆరోపించారు. పాయల్ ఘోష్- అనురాగ్ కేసు బాలీవుడ్ ని ఊపేసింది. కేవలం బాలీవుడ్ లోనే ఈ పరిస్థితి ఉంది. సౌత్ ఇండియాలో ఆరోగ్యకర వాతావరణం ఉంది. హీరో ఎన్టీఆర్ మహిళకు చాలా గౌరవం ఇస్తారని ఆమె గతంలో చెప్పుకొచ్చారు. 

45

తెలుగులో పాయల్ ప్రయాణం, ఊసరవెల్లి చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి మూవీలో పాయల్ సపోర్టింగ్ రోల్ చేసింది. ఓ ఆంగ్ల చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం కావడం విశేషం. ఇక ప్రయాణం చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. 

 

55

నేను సౌత్ లో ఇద్దరు నేషనల్ విన్నింగ్ డైరెక్టర్స్ తో పని చేశాను. ఎవరు నన్ను కనీసం అసభ్యకరంగా తాకలేదు. అనురాగ్ కశ్యప్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా అతడు నన్ను రేప్ చేశాడని, ఈ ఏడాది మార్చి లో పాయల్  ట్వీట్ చేసింది. 

click me!

Recommended Stories