కీర్తి సురేష్ ఇలా కంటపడితే చూపుతిప్పుకోవడం కష్టమే.. టాప్ అందాలతో మైమరిపిస్తున్న కళావతి.!

First Published | Feb 19, 2023, 11:20 AM IST

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) సినిమాల  పట్ల ఎంత శ్రద్ధగా ఉంటారో తన  పర్సనల్ లైఫ్ కూ అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలో  కొన్ని తన పర్సనల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

దక్షిణాది ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు టాలీవుడ్  హీరోయిన్ కీర్తి సురేష్.  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. 
 

కీర్తి సురేష్ కు ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంది. చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అదే జోష్ తో ఇండస్ట్రీలో మరింతగా దూసుకెళ్తున్నారు. 


మరోవైపు తన అభిమానులతోనూ టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. సినిమా విషయాలనే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటూ మరింత దగ్గరవుతున్నారు. ఇక కీర్తి తన పర్సనల్ లైఫ్ ను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. 
 

సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అందులోనూ ఫ్రెండ్స్ తోనూ కీర్తి  ఎక్కువగా కనిపిస్తుంటారు. స్నేహితులతో కలిసి బయటికి  వెళ్తూ.. పార్టీలకు, చిన్న చిన్న వేకేషన్స్ కు వెళ్తూంటారు. 
 

ఇక తాజాగా కీర్తి తన ఫ్రెండ్స్ తో  ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. ఈ సందర్భంగా హాల్ లో స్టన్నింగ్ గా ఫొటోలకు పోజులిచ్చారు. ఫ్రెండ్స్ తో సరదగా గడిపిన పిక్స్ ను అభిమానులతో పంచుకున్నారు. స్నేహితులకు ఇంత ప్రాధాన్యత ఇస్తుండటం పట్ల తన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

మరోవైపు కీర్తి అదిరిపోయే అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ గా మెరిశారు. స్లీవ్ లెస్ అండ్ క్రాప్డ్ మినీ టాప్ లో ఎద అందాలను విందు చేసింది. టాప్ గ్లామర్ షోతో మతిపోగొట్టేసింది. స్టార్ బ్యూటీ కవ్వింపు పోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఫొటోలను లైక్స్ తో వైరల్ చేస్తున్నారు. ఇక కీర్తి ప్రస్తుతం తెలుగులో నాని సరసన ‘దసరా’లో అలరించబోతోంది.  అలాగే చిరుకు చెల్లెలిగా  ‘భోళా శంకర్’లోనూ మెరియనుంది. 

Latest Videos

click me!