‘బిచ్చగాడు2’ హీరోయిన్ చనిపోయేదే బతికిందా.. అలాంటి సాహసం చేసిన కావ్య థాపర్

First Published | May 20, 2023, 2:31 PM IST

యంగ్ బ్యూటీ కావ్య థాపర్ (Kavya Thapar) షాకింగ్ న్యూస్ ను రివీల్ చేశారు. ’బిచ్చగాడు2‘ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో చేసిన సాహసం తన ప్రాణాలకే ప్రమాదంగా మారిందని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
 

‘ఏక్ మినీ కథ’ చిత్రంతో కావ్య థాపర్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. గ్లామర్ తోనూ, నటన పరంగానూ ఆకట్టుకుంది. మొదట ’ఈ మాయ పేరేమిటో‘ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రాలతో తనకంటూ క్రేజ్ దక్కించుకుంది.
 

ప్రస్తుతం స్టార్ హీరోల సరసన కూడా ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ దక్కించుకుంటోంది. అయితే తాజాగా కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ‘బిచ్చగాడు 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ఆంటోనీ సరసన మంచి పెర్ఫామెన్స్ ను అందించింది. ఈ చిత్రం కావ్యకు మంచి క్రేజ్ ను తీసుకొచ్చిందనే చెప్పాలి.
 


కాగా, Bichchagadu2  సినిమా షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో విజయ్ అపస్మారక స్థితిలో బోట్ నుంచి  సముద్రంలో పడిపోయారని, కావ్య థాపర్ రక్షించిందని ఆంటోనీ కూడా స్వయంగా చెప్పారు. దీనిపై తాజాగా కావ్య తాజాగా స్పందించారు. 
 

కావ్య థాపర్ మాట్లాడుతూ.. ’ప్రమాదం జరిగిన వెంటనే విజయ్ ఆంటోనీ సముద్రంలో పడిపోయారు. ఆయన్ని రక్షించాలనే తపనతో నేనూ సముద్రంలో దూకాను. ఈత కొడుతూ వెళ్లి ఆయన్ని పట్టుకున్నాను. ఆ సమయంలో నేనూ మరణం అంచుల దాకా వెళ్లినట్టు అనిపించింది.

వెంటనే యూనిట్ మా వద్దకు వచ్చి రక్షించారు. ఆ ఘటన ఇప్పుడు తలుకున్నా భయం పడుతోంది. అప్పుడు నా ముఖానికి గాయాలయ్యాయి.‘ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కావ్య సాహసానికి ఫ్యాన్స్, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. 

ప్రస్తుతం కావ్య థాపర్ పేరు చిత్ర పరిశ్రమలో జోరుగానే వినిపిస్తోంది. చివరిగా ‘ఫర్జీ’, ‘బిచ్చగాడు 2’ చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన నటించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే సందీప్ కిషన్ కు జోడీగా ‘ఊరు పేరు బైరవకోన’తోనూ అలరించబోతోంది.
 

Latest Videos

click me!