Vimala Raman Marriage: విలన్ ను పెళ్ళాడబోతున్న విమలా రామన్, సీక్రేట్ గా చేసుకోబోతున్నారా...?

Published : Apr 05, 2022, 09:57 AM IST

ఈ మధ్య ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్ళిళ్లు ఎక్కువైపోయాయి. చాలా మంది స్ర్ సెలబ్రిటీ జంటలు పెళ్ళికి రెడీ అవుతున్నారు. కొంత మంది చేసేసుకున్నారు కూడా. ఇక ఇప్పుడు సౌత్ లో మరో జంట పెళ్లికి రెడీ అయ్యింది. 

PREV
17
Vimala Raman Marriage: విలన్ ను పెళ్ళాడబోతున్న విమలా రామన్, సీక్రేట్ గా చేసుకోబోతున్నారా...?

విమలా రామన్ సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. సౌత్ లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసింది మలయాళ బ్యూటీ విమలా రామన్.  ముఖ్యంగా తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది విమలా. నాలుగు పదుల వయస్సుకి వచ్చేసిన విమలా.. వివాహానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. 
 

27

మోడల్‌గా కెరీర్ ఆరంభించి తరువాత హీరోయిన్‌గా మారిన అందాల భామ విమలా రామన్. మలయాళం ఇండస్ట్రీలో నటిగా ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన విమలా రామన్ ఆతరువాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. 

37

తెలుగులో గాయం-2, చట్టం, ఎవరైనా.. ఎపుడైనా  లాంటి సినిమాలతో లతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. విమలా రామన్‌కు సంబంధించిన ఓ న్యూస్ కోలీవుడ్ లో తెగ హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. విమలా రామన్ పెళ్లి చేసుకోబోతోందట. 

47

విమలా రామన్  త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా లవ్ మ్యారేజ్. వినయ్ రాయ్ అనే తమిళ నటుడిని విమలా రామన్ ప్రేమిస్తోంది. గత కొన్నేళ్లుగా అతడితో డేటింగ్ చేస్తుంది. ఈ లవ్‌బర్డ్స్ తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

57

వినయ్ రాయ్, విమలా రామన్ చాలా సార్లు జంటగా మీడియా కంట కూడా పడ్డారు. మాల్దీవుల్లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఈ లవ్ బర్డ్స్ సోషల్ మీడియాలో అనేకసార్లు వేర్వేరుగా అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లితో ఒకటి కాబోతున్నారటి తెలుస్తోంది. 
 

67

సన్నిహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం పెళ్లి జరిగే తేదీని త్వరలో ఈ జంట స్వయంగా అధికారికంగా ప్రకటిస్తారట. అయితే.. ఈ జంట పెళ్లి చేసుకుంటరా లేదా అనేది మాత్రం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
 

77

ఇక విమలా రామన్ పెళ్ళి చేసుకోబోయే నటుడు వినయ్ రాయ్ డిటెక్టివ్, చంద్రకళ, వరుణ్ డాక్టర్ లాంటి హిట్ సినిమాల్లో విలన్ గా నటించాడు. అయితే ఈ జంట సీక్రేట్ గా  పెళ్లి  చేసుకుంటారన్న మాట కూడా వినిపిస్తుంది. ఈ విషయాన్ని వారు అనౌన్స్ చేస్తారా..? లేక సీక్రేట్ గా మ్యారేజ్ చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. 
 

click me!

Recommended Stories