చీరలో చిరునవ్వులు చిందిస్తూ కిల్లింగ్స్ లుక్స్ తో చంపేస్తుండగా నభా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. దేవుడా...కళ్ళు తిప్పుకోలేకున్నాని ఒక నెటిజెన్ కామెంట్ చేస్తే...గార్జియస్ క్వీన్ అంటూ మరొకరు కాంప్లిమెంట్ ఇచ్చారు.
చీర కట్టులో నభా నడుము వంపులు ఆకట్టుకుంటుంటే..అందమైన వీపు రెచ్చగొట్టేలా ఉంది. మొత్తంగా చీర కట్టులో నభా అందాలు మత్తెక్కిస్తున్నాయి.
కన్నడ పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, పూర్తి ఫోకస్ టాలీవుడ్ పైనే పెట్టింది. రవి బాబు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అదుగో తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నభా.
గత ఏడాది దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ శంకర్ మూవీతో భారీ హిట్ అందుకుంది. ఆ మూవీలో ఓ హీరోయిన్ గా చేసిన నభా తెలంగాణా మాస్ పోరీగా చాలా సహజంగా నటించింది. రవితేజకు జంటగా చేసిన డిస్కో రాజా మాత్రం ప్లాప్ అయ్యింది.
ప్రస్తుతం తెలుగులో నభా రెండు చిత్రాలు చేస్తుంది. మెగా హీరో సాయిధరమ్ హీరోగా దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ మూవీలో నభా హీరోయిన్ గా చేస్తున్నారు. పాజిటివ్ బజ్ ఏర్పడిన ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి.
అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న అల్లుడు అదుర్స్ మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏది హిట్ అయినా నభా కెరీర్ సెటిల్ కావడం ఖాయం.