నటుడు శ్రీరామ్ గురించి పరిచయం అవసరం లేదు. శ్రీరామ్ హీరోగా, నటుడిగా తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, స్నేహితుడు చిత్రాలు శ్రీరామ్ కి మంచి గుర్తింపు తెచ్చాయి.
27
హీరోగా మాత్రమే కాకుండా శ్రీరామ్ క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ రాణిస్తున్నాడు. త్వరలో శ్రీరామ్ 10క్లాస్ డైరీస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జూలై 1న ఈ చిత్రంరిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో శ్రీరామ్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
37
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీరామ్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ గత విషయాలు గుర్తు చేసుకున్నాడు. మంచి అవకాశాలు వస్తున్న టైం ఫైర్ యాక్సిడెంట్ వల్ల వెనకబడిపోయినట్లు శ్రీరామ్ తెలిపాడు. ఘోరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పటికీ బతికి బయట పడ్డాను. అమ్మానాన్నల ఆశీర్వాదం, దేవుడి దయ వల్ల తిరిగి కెరీర్ లో కూడా నిలదొక్కుకున్నాను శ్రీరామ్ తెలిపాడు.
47
తనకు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. త్రిషతో ఊటీలో సాంగ్ షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాపై చిత్రీకరించే షాట్ లో నేను 30 అడుగుల ఎత్తులో ఉండాలి. డ్యామ్ ఉన్న ప్రాంతంలో షూటింగ్. డిసెంబర్ కాబట్టి చలి తీవ్రంగా ఉంది. న చుట్టూ మంటలు ఉంటాయి. మధ్యలో నేను ఉండాలి.
57
ఆర్ట్ అసిస్టెంట్ తెలియకుండా రబ్బర్ ఎక్కువ పోసేశాడు. అదే సమయంలో గాలి బాగా వీచింది. దీనితో ఒక్కసారిగా మంటలు ఎక్కువయ్యాయి. వెంటనే నేను మంటల్లో చిక్కుకుపోయి. డ్యామ్ ఉన్న ప్రాంతం కాబట్టి వేరే వాళ్ళు వచ్చి రక్షించలేని పరిస్థితి. దూకేద్దాము అనుకున్నా.. కానీ డ్యామ్ చాలా లోతు ఉంది వద్దు అని అరిచారు. నిచ్చెన కూడా ఎక్కడో దూరంగా పెట్టారు. నాకు మంటలు అంటుకునేశాయి.
67
చివరికి ఎలాగో నిచ్చెన తీసుకురావడంతో అందులోనుంచి బయట పడ్డా అప్పటికే న బాడీ కాలిపోయింది. షర్ట్ తో పాటు చర్మం కూడా ఊడి వచ్చేసింది. పెదవులు, చెవులు, జుట్టు బాగా కాలిపోయాయి. నేను బ్రతుకుతాననే నమ్మకం లేదు. ఆ టైం లో నేను ఆలోచించింది మా అమ్మా నాన్న గురించే. నాన్న దగ్గర డబ్బులు సేవింగ్స్ లేవు.
77
మాకు ఆస్తులు కూడా లేవు. దీనితో వాళ్ళ పరిస్థితి ఏంటా అని కుములిపోయా. అమ్మా నాన్నల ఆశీర్వాదం, దేవుడి దయ వల్ల నేను కోలుకున్నాను. తిరిగి కెరీర్ లో నిలదొక్కుకోగలిగాను అని శ్రీరామ్ తెలిపారు. ఒకరికి ఒకరు విజయం తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. అదే సమయంలో ఈ యాక్సిడెంట్ జరగడం నా కెరీర్ కి మైనస్ గా మారింది అని శ్రీరామ్ అన్నారు. ఆ ప్రమాదంతో దాదాపు 8 నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాను అని శ్రీరామ్ తెలిపారు. దీనితో నాకు వచ్చిన ఆఫర్స్ అన్ని వెనక్కి వెళ్లిపోయాయి అంటూ తనకు జరిగిన ఘోర ప్రమాదాన్ని శ్రీరామ్ గుర్తు చేసుకున్నారు.