#SundaramMaster:వైవా హర్ష 'సుందరం మాస్టర్' రివ్యూ

First Published | Feb 23, 2024, 1:07 PM IST


మాస్ మహరాజ్ రవితేజ నిర్మాణ సంస్థ ఆర్.టి.టీమ్ వర్క్స్ ఈ సినిమాని తెరకెక్కించటంతో ఉన్నంతలో బాగానే బజ్ క్రియేట్ అయ్యింది. 

Sundaram Master


మొదట్లో యూట్యూబ్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హర్ష చెముడు..ఇప్పుడు సినిమాల్లోనూ బిజీ అయ్యాడు. చాలా  సినిమాల్లో కమెడియన్‌గా కూడా చేశాడు. ఇప్పుడు ఏకంగా తనే ప్రధాన పాత్రలో సుందరం మాస్టర్‌ అంటూ కనిపించాడు. మారు మూల పల్లెలోని  గ్రామస్తులకు ఇంగ్లీష్‌ నేర్పే టీచర్‌గా ఈ సినిమాలో నటించాడు. అయితే ఇలాంటి సినిమాలకు గ్లామర్ అప్పీల్,స్టార్ వాల్యూ  ఉండదు కాబట్టి కేవలం కంటెంట్ మీదే సక్సెస్ డిపెంట్ అయ్యి ఉంటుంది. మరి ఈ సినిమాలో కంటెంట్ సక్సెస్ ఇచ్చేలాగానే ఉందా...హర్షకు మరిన్ని సినిమాలు హీరోగా తెచ్చిపెడుతుందా...వంటి విషయాలు  రివ్యూ లో చూద్దాం.

Sundaram Master


స్టోరీ లైన్: 

గవర్నమెంట్ స్కూల్ సోషల్ మేస్టార్ సుందరం (వైవా హర్ష) కు ఇంకా పెళ్లి కాలేదు. మంచి కట్నం కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో అతనికి డీఈవో గా ప్రమోషన్ వచ్చే ఆఫర్ వస్తుంది.   లోకల్ ఎమ్మెల్యే(కమెడియన్ హర్ష వర్ధన్) పాఠశాలకు వచ్చి... అక్కడ పనిచేసే టీచర్స్ ని  పరిశీలించి... సుందరం మాస్టర్ ని ఎంచుకుంటాడు. గత 90 ఏళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా  మిరియాల మెట్ట అనే ఓ ఊరు వెళ్లమంటాడు. అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందని లెటర్ రాసారని, అంతేకాకుండా అక్కడ ఊళ్లో ఓ సీక్రెట్ ఉందని అది కనుక్కుంటే డీఈవో గా ప్రమోషన్ ఇస్తానంటాడు. డీఈవో అయితే ఎక్కువ కట్నం వస్తుందని ఆ ఊరు బయిలుదేరతాడు. అక్కడకు వెళ్లాక షాక్ ఇచ్చే చాలా విషయాలు జరుగుతాయి. అవేమిటి..ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వెళ్లిన సుందరం మాస్టారు తనే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పరిస్దితి ఎందుకు వచ్చింది...అలాగే ఆ ఊరు బయిట ప్రపంచంతో ఎందుకు లింక్ లు తెంపేసుకుంది. ఆ ఊళ్లో ఉన్న సీక్రెట్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


Sundaram Master


ఎనాలసిస్ ..

ఏదో చెప్దామని కథ మొదలెట్టి వేరే ఏదో చెప్పి ముగించినట్లు అనిపిస్తుంది. అలాగే మనం కామెడీ సినిమా చూద్దామని కూర్చుంటే వేరే ఏదో చూపిస్తూంటారు. ఇలాంటి సినిమాలకు కథ,కథనం  వైవిధ్యంగా ఉండటమే కలిసొచ్చే అంశం.  అయితే ఈ సినిమా ఆ స్దాయిలో అనిపించదు. కొన్ని తెగల వాళ్ళు ప్రపంచానికి సంబంధం లేకుండా బతకడం, వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే చంపేయడం లాంటివి మనం నిజ జీవితంలో వినేవే అయినా తెరపై అంత సహజంగా అనిపించేలా తీయలేదు. ఫస్ట్ హాఫ్ అంతా సుందరం మాస్టర్ పాత్ర, అతను అక్కడికి వెళ్లి పడే బాధల గురించి కామెడీగా చూపించే ప్రయత్నం చేసారు. ఇంట్రవెల్ కు కథ టర్న్ తీసుకుంటుంది.  వేరే డైమన్షన్ లోకి వెళ్తుంది. సెకండ్ హాఫ్ అంతా  ఆ పాయింట్ చుట్టూ తిరుగుతుంది. కాకపోతే మనం ఎక్సపెక్టే చేసిన కామెడీ ఎక్కడా దొరక్క మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది. హర్షకు అక్కడ ఆ అటవిక విలేజ్ జనాలకు మధ్య వచ్చే కామెడీ సరిపోతుందనుకున్నారు. కానీ అది చాలలేదు. 

Sundaram Master


అలాగే కొన్ని విషయాలు క్లారిటీ ఇవ్వలేదు. నల్లగా ఉండే వాళ్ళని అడవిలో వాళ్ళు ఎందుకు ఇష్టపడతారో అనేది చెప్పలేకపోయారు. హీరోయిన్ శ్రీ పాద ని కూడా  పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు. ఇంగ్లీష్ ని  తప్పుగా  చెప్పడమే కామెడీ అనుకున్నారు. కానీ అదీ సోసోగా ఉంది.  ఇక కొన్ని సీన్స్ లో అయితే మరీ  ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. ఆ ఊరిని బ్రిటిషర్లు నుండి కాపాడిన దొరగా బ్రహ్మానందం ని గ్రాఫిక్స్ లో వాడుకోవటం బాగానే ఉంది కానీ సీరియస్ గా చెప్పాల్సిన విషయం కామెడీ అయ్యిపోయిందేమో అనిపిస్తుంది. అలాగే ఆ ఊరి వారికి బయట ఒక ప్రపంచం  మారిందని తెలియకపోవడం, క్రికెట్, రొటేషన్ లో ఉన్న డబ్బుల గురించి తెలియకపోవడం వంటివి కొద్దిగా వింతగా అనిపిస్తాయి. అలాగే  గాంధీ ఇతనే అని 500 నోటు సుందరం మాస్టర్ చూపిస్తే ఆ నోటుని చింపేసి గాంధీ ఫోటో మాత్రం తీసుకోవడం.. లాంటి సీన్స్ కొత్తగా ఏమో కానీ కాస్తంత విచిత్రంగా అనిపిస్తాయి.  

Sundaram Master


టెక్నికల్ గా...

కెమెరా వర్క్ బాగుంది.  అడవులు, జలపాతం, మధ్యలో కర్రలతో కట్టిన ఇల్లు ఉన్న ఓ చిన్న విలేజ్ వంటివి బాగా చూపించారు.  కథ కూడా బిలీవబులిటీకు దగ్గరగా ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే  కూడా ఆసక్తిగా బోర్ కొట్టకుండా సాగకపోవటం విసిగిస్తుంది.  ఎడిటింగ్ కూడా ఇంకాస్త క్లారిటీ వచ్చేలా చూసుకోవాల్సింది. దర్శకుడిగా కళ్యాణ్ సంతోష్ కొత్త పాయింట్ ని ఎంచుకోవటం వరకూ సక్సెస్ అయ్యాడు కానీ ఎగ్జిక్యూషన్ లో తడబడ్డాడనే చెప్పాలి.   నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఉన్నంతలో  బాగానే ఖర్చుపెట్టారు. ఉన్నంతలో ప్లస్ పాయింట్ ఏమిటంటే..హింస‌, బూతు అనుకొంటున్న రోజుల్లో అవేం లేకుండా ఓ క్లీన్ సినిమా చూపించే ప్ర‌య‌త్నం చేయటమే. చిన్న సినిమానే క‌దా అని చుట్టేయ‌లేదు. వీలైనంత వ‌ర‌కూ క్వాలిటీ పాటించారు.   కొన్ని ఎపిసోడ్స్ మాత్రం  తేలిపోయాయి.   శ్రీచరణ్‌ పాకాల అందించిన మ్యూజిక్‌ బాగుంది. 

Sundaram Master


నటీనటుల్లో ...

హర్ష వైవా  మాత్రం ఎక్కడా వంకపెట్టలేని విధంగా సుందరం మాస్టర్ క్యారక్టర్ లో ఫెరఫెక్ట్ గా చేసారు. అయితే  తన క్యారక్టరైజేషన్ మరింత డీప్ గా చూసుకుని డిజైన్ చేసి ఉండాల్సింది. అలాగే స్క్రిప్ట్ కూడా అతనికి కలిసి రాలేదు. ఇక దివ్యశ్రీపాద  బాగుంది కానీ బాగా చెయ్యటానికి సరిపడ స్క్రీన్ టైమ్ లేదు. ఎంఎల్ ఏ క్యారక్టర్ లో హర్ష వర్షన్ ఎప్పటిలాగే చేసుకుంటూ పోయారు. 

Sundaram Master


ఫైనల్ థాట్

కామెడీ లేని కామెడీ సినిమా ఇది. ఓటిటి సినిమాగా అలరిస్తుందేమో కానీ...థియేటర్ కు పనిగట్టుకువెళ్లి మరీ చూడాలంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది.  
Rating:2
 

Sundaram Master

బ్యానర్: ఆర్.టి టీం వర్క్స్ , గోల్డెన్ మీడియా  
నటీనటులు: హర్ష చెముడు, దివ్య శ్రీపాద,హర్ష వర్ధన్, భద్రం, షాలిని నంబు, శ్వేత, బాలకృష్ణ నీలకంఠాపూర్ తదితరులు 
సంగీతం: సాయి చరణ్ పాకాల 
కెమెరా : దీపక్ 
ఎడిటర్: కార్తీక్ 
ఆర్ట్ డైరెక్టర్: ఎ రామాంజనేయులు
రచన, దర్శకత్వం:కళ్యాణ్ సంతోష్ 
నిర్మాతలు :రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు
విడుదల తేదీ: ఫిబ్రవరి 23  2024
 

Latest Videos

click me!