‘ముద్దు సీన్లా.. ఓకే అంటూ కండీషన్స్ చెప్పిన మీనాక్షి చౌదరి’.? ‘గుంటూరు కారం‘ హీరోయిన్ షరతులివే!

First Published | Jan 28, 2024, 9:48 PM IST

టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న మీనాక్షి చౌదరి ముద్దు సీన్లపై తాజాగా స్పందించింది. తను అలాంటి సీన్లలో నటించాల్సి వస్తే కండీషన్స్ అప్లై అంటూ చెప్పుకొచ్చింది.

క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary రీసెంట్ గా ‘గుంటూరుకారం’ Guntur Kaaramతో అలరించింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu సరసన నటించి మెప్పించింది. 

‘గుంటూరు కారం’ తర్వాత ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు అందుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీలీలాను ఢీకొట్టేలా తన పెర్ఫామెన్స్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ బ్యూటీని ఆయా ప్రాజెక్ట్స్ ల్లో ఎంపిక చేసే పనిలో ఉన్నారు. 


ఇప్పటికే విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ లో ఈ ముద్దుగుమ్మ పేరు స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రీసెంట్ ఇంటర్వ్యూలో  మీనాక్షి చౌదరి తన చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడింది. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 
 

తను మాట్లాడుతూ.. ‘మహేశ్ బాబు సరసన నటించడంతో నా సంతోషానికి అవధుల్లేవు. ఆయనతో మొదటి రోజు నటించేందుకు కంగారు పడ్డా. కాను బాబు ఇంకాస్తా సమయం ఇచ్చారు. ధైర్యం చెప్పారు. తొలిరోజే ఆయనతో నటించాను. 

ఇక సినిమాల విషయంలో... ముఖ్యంగా ముద్దు సీన్ల విషయంలో కొన్ని నియమాలు పెట్టుకున్నాను. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే, అదికూడా మరీ అసభ్యకరంగా లేకుంటేనే చేస్తాను. కేవలం కిస్ సీన్స్ కోసమే అంటే కచ్చితంగా నో చెప్పేస్తా.’ అని చెప్పుకొచ్చింది. 
 

తెలుగు ప్రేక్షకులు నాపై చాలా ప్రేమను చూపిస్తున్నారు. అందుకే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.’ అని వివరించింది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’, ‘ఖిలాడీ’, ‘హిట్ 2’, రీసెంట్ గా ‘గుంటూరు కారం’తో అలరించింది.  

Latest Videos

click me!