యానిమల్.. అసలు ఏంటా మూవీ అది, విసిగిపోయా.. జనాలు మూడున్నర గంటలు ఎలా చూశారో

సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ సంచలన విజయం గా నిలిచిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ ని సందీప్ తనదైన శైలిలో చాలా బోల్డ్ గా ప్రజెంట్ చేశారు. సందీప్ రెడ్డి టేకింగ్ కి ప్రశంసలు దక్కాయి.

సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ సంచలన విజయం గా నిలిచిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ ని సందీప్ తనదైన శైలిలో చాలా బోల్డ్ గా ప్రజెంట్ చేశారు. సందీప్ రెడ్డి టేకింగ్ కి ప్రశంసలు దక్కాయి. సందీప్ రెడ్డి చిత్రం అంటే రొమాన్స్ కూడా బోల్డ్ గానే ఉంటుంది. దీనితో యువత పండగ చేసుకున్నారు. 

రణబీర్ కపూర్ మాత్రం యాంగ్రీ అండ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరహో అనిపించాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యానిమల్ మూవీ మీమ్స్ కనిపిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.


అయితే తమిళ జనాలు, సెలెబ్రిటీలకి యానిమల్ చిత్రం ఏమాత్రం నచ్చడం లేదు. తమిళ ఆడియన్స్ ఒకవైపు ఈ చిత్రాన్ని ట్రోల్ చేస్తుంటే సెలెబ్రిటీలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఓటిటిలోకి రిలీజ్ అయిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. 

ఇటీవల సీనియర్ నటి రాధిక యానిమల్ చిత్రాన్ని విమర్శిస్తూ పోస్ట్ చేసింది.  తాజాగా గృహలక్ష్మి సీరియల్ నటి, ఒకప్పటి హీరోయిన్ కస్తూరి శంకర్ యానిమల్ మూవీపై సంచలన వ్యాఖ్యలతో పోస్ట్ చేసింది. గత రాత్రి ఈ చిత్రం చూద్దామని ప్రారంభించాను. సగం చూసే సరికే నాకు చిరాకు పుట్టింది. ఇక జనాలు మూడున్నర గంటలు ఈ చిత్రాన్ని ఎలా చూశారో అర్థం కావడం లేదు. 

మాటల్లోనే ప్రేమలో పడిపోవడం ఏంటో ? ఆ ఆటో ప్లైయింగ్ ప్లేన్స్ ఏంటో ? అన్ని చాలా వేగంగా జరిగిపోయాయి. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ చిత్రం కోసం అన్ని విభాగాలు చాలా చక్కగా వర్క్ చేశారు. కానీ అన్ని చాలా అతిగా అనిపించాయి. నాకు ఈ చిత్రం వినోదాన్ని కలిగించలేదు అంటూ కస్తూరి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

నిజమే అంటూ తమిళ ఆడియన్స్ కస్తూరి వ్యాఖ్యలకు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో సోషల్ మీడియాలో తెలుగు.. తమిళ చిత్రాలపై పరస్పరం ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ చేశారు. తెలుగు ఆడియన్స్ లియో, పొన్నియన్ సెల్వన్ చిత్రాలని ట్రోల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!