ఈ సారి ఆస్కార్‌ బరిలో గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక.. వారితో పోటీ ?

First Published | Sep 22, 2020, 8:57 AM IST

ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌. బాలీవుడ్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పేసి హాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉంది. ఓ రకంగా పూర్తి స్థాయిలో హాలీవుడ్‌కి వెళ్ళిపోయిన ఇండియన్‌ స్టార్‌ ప్రియాంకా అనే చెప్పొచ్చు. ఇది ఓ రకంగా మనం గర్వించాల్సిన విషయమే. 
 

బీహార్‌కి చెందిన ఈ సెక్సీ భామ బాలీవుడ్‌ని గత మూడేళ్ళ వరకు ఓ ఊపు ఊపేసింది. `సలామ్‌ ఈ ఇష్క్`, `లవ్‌స్టోరీ 2050`, `ద్రోణా`, `ఫ్యాషన్‌`, `కమినే`, `డాన్‌ 2`, `అగ్నీపథ్‌`, `బర్ఫీ`, `క్రిష్‌`, `క్రిష్‌3`, `మేరీకోమ్‌` వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదిగారు.
`ఫ్యాషన్‌` చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని కూడా సొంతం చేసుకోవడం విశేషం.

నటిగానే కాదు, సింగర్‌, డాన్సర్‌గా మ్యూజిక్‌ వీడియోస్‌తోనూ మెస్మరైజ్‌ చేసింది. టెలివిజన్‌, షార్ట్ ఫిల్మ్ లోమెరిసింది.
నిర్మాతగా పర్పుల్‌ పెబ్బుల్‌ పిక్చర్స్ పతాకంపై జాతీయ అవార్డు చిత్రాలను నిర్మిస్తుంది. సినిమా పట్ల తనఫ్యాషన్‌ని చాటుకుంటోంది.
గత మూడేళ్ళుగా ప్రియాంక హాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. `క్వాంటికో` వెబ్‌ సిరీస్‌లో నటించే ఛాన్స్ ని అందుకునితానేంటో నిరూపించుకుంది. దీంతో వరుసగా హాలీవుడ్‌ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.
`బేవాచ్‌`, `ఏ కిడ్‌ లైక్‌ జేక్‌`, `ఈజ్‌ నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌?` వంటి హాలీవుడ్‌ చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఈ హాట్‌బ్యూటీ `వి కెన్‌ బీ హీరోస్‌`, `ది మ్యాట్రిక్స్ 4`, `ది వైట్‌ టైగర్‌` చిత్రాల్లో నటిస్తుంది. `ది వైట్‌ టైగర్‌`కి నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం.
అయితే `ది వైట్‌ టైగర్‌` ఈ సారి ఆస్కార్‌ బరిలో నిలవబోతుంది. 2020కిగానూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోఅందించే ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌కి పంపించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో సహాయ నటిగా పాత్ర విభాగంలో ప్రియాంకని నామినేషన్‌ కోసం పంపబోతున్నట్టు తెలుస్తుంది.
నామినేషన్‌కి ఎంపికైతే హాలీవుడ్‌ స్టార్స్ మెరిల్‌ స్ట్రీప్‌, నటాషా లయాన్‌, మారే విన్నింగ్‌హామ్‌ వంటి హాలీవుడ్‌స్టార్స్ తో ప్రియాంక ఆస్కార్‌ కోసం పోటీపడనుందని చెప్పొచ్చు. ఇది ఓ రకంగా భారత్‌కి గర్వకారణమనే చెప్పాలి.అయితే `ది వైట్‌ టైగర్‌` ఇంకా థియేటర్‌లో విడుదల కాలేదు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లో విడుదలకు ప్లాన్‌చేస్తున్నారు.

Latest Videos

click me!