కేంద్ర ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’ Padma Vibhushan Awardను ప్రకటించింది. నిన్న రాత్రి 2024 పద్మ పురస్కారాలను (Padma Awards 2024) జాబితాను వెల్లడించారు. ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్ తో పాటు 110 మందికి పద్మశ్రీ అవార్డులు అందాయి. మెగాస్టార్ చింరజీవి Chiranjeevi కి పద్మ విభూషణ్ padma Vibhushan అందింది.
పద్మ విభూషణ్ అందుకున్న తొలి కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు Akkineni Nageswara Rao. దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ఈ గౌరవం ఆయనకు 2011లో దక్కింది.
ఆ తర్వాత ఈ పురస్కారాన్ని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ Amitabh Bachchan అందుకున్నారు.2015లో ఈ అవార్డు వరింది. ఇక అదే ఏడాది హీరో దిలీప్ కుమార్. కు కూడా అందింది.
2016లో సూపర్ స్టార్ రజినీకాంత్ Rajinikanth ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. సౌత్ లో బిగెస్ట్ స్టార్స్ లో రజినీ ఒకరనే విషయం తెలిసిందే.
ప్రముఖ సింగర్, దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం SP Balasubrahamanyam 2021లో పద్మ విభూషణ్ అందుకున్నారు. అంతకు ముందే పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులను అందుకున్నారు.
లతా మంగేష్కర్ చెల్లెలు ఆశా భోంస్లేకు 2008లో ఈ గౌరవం దక్కింది. ఆమె ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు.
గాయకుడు కేజే ఏసుదాసు KJ Yesudasu 2017లో ఈ అత్యున్నత అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఆయనకు గాయకుడిగా మరింత గౌరవం పెరిగింది.
బాలీవుడ్ ప్రముఖ సింగర్, దివంగత లలా మంగేష్కర్ కు 1999లో ఈ గౌరవం దక్కింది. వీటితో పాటు పద్మ భూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, భారత రత్న అవార్డును సొంతం చేసుకుంది.
మ్యాస్ట్రాో, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా Ilayarajaకు 2018లో పద్మ విభూషణ్ అవార్డు దక్కింది.ఇప్పటికీ ఆయన సంగీతానికి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే.
ఇక 90, 80లలోనే ఈ అవార్డును అందుకున్న వారిని చూద్దాం. మొదట ఉదయ్ శంకర్. 1971 డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ గా ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.
ఆర్టిస్ట్ బెనోడ్ బిహారీ ముఖర్జీ 1974లో ఈ గౌరవం అందుకున్నారు. ఈయన పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు కావడం విశేషం.
సింగర్ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి 1975 లో అవార్డు దక్కింది. ఈమె కర్నాటక శాస్త్రీయ గాయకురాలు. తమిళనాడుకు చెందిన గాయత్రి.
ప్రఖ్యాత నర్తకి, భరతనాట్యంలో ప్రసిద్ధి చెందిన టి. బాలసరస్వతి 1977లో పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు.
సితార్ వాద్యకారుడు మరియు స్వరకర్త, సితార్ కళాకారిణి రవిశంకర్ ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. 1981లో ఆయనకు ఈ గౌరవం దక్కింది.
90లో మరాఠీ మరియు హిందీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వి శాంతారాంను 1992లో ఈ అవార్డు వరించింది.