రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘జాతిరత్నాలు’తో ఫరియా అబ్దుల్లా మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా తనకు ఇది తొలిచిత్రం. అయినా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. మరోవైపు క్యూట్ లుక్స్ తోనూ కట్టిపడేసింది.
ఆ చిత్రం మంచి హిట్ కొట్టడంతో ఫరియా క్రేజ్ కూడా ఒక్కసారే అమాంతం పెరిగిపోయింది. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటున్నారు ఫరియా. ముఖ్యంగా సినిమాలతో పాటు ఫరియా సోషల్ మీడియాలోనూ ఎక్కువగా యాక్టివ్ గా కనిపిస్తుంటారు.
రీల్స్, ఫన్నీ వీడియోస్, తన వ్యక్తిగత విషయాలను, సినిమా అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు. మరోవైపు క్రేజీ గా ఫొటోషూట్లు కూడా చేస్తూ అదరగొడుతోంది. ఇటీవల గ్లామర్ షోకూ తెరలేపిందీ బ్యూటీ. ఈక్రమంలో లేటెస్ట్ గా ఫ్యాన్స్ తో పంచుకున్న పిక్స్ ఆకట్టుుకుంటున్నాయి.
రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన టీచ్ ఫర్ చేంజ్ 2023 ఈవెంట్ లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఫరియా అబ్దుల్లా కూడా హాజరయ్యారు. ర్యాంప్ వాక్ తో అదరగొట్టారు.
ఈవెంట్ సందర్భంగా ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చి అందరి చూపు తనపైనే పడేలా చేసింది. గ్లామర్ తో ఆకట్టుకుంది. ఈ సందరర్భంగా బ్యూటీఫుల్ లోకేషన్ లో ఫొటోషూట్ కూడా చేసి.. ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. పిక్స్ ను ఫ్యాన్స్ లైక్ చేస్తున్నారు.
నిలువెత్తు అందం సందప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతుండగా.. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా మంత్రముగ్ధులవుతున్నారు. పిక్స్ ను లైక్స్ చేస్తూ.. కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక ప్రస్తుతం ఫరియా తెలుగులో మాస్ మహారాజా ‘రావణసుర’తో పాటు.. తమిళంలోని ‘వల్లి మయిల్’లో నటిస్తోంది.