Devatha: పిల్లల కోసం ఆదిత్యకు మూడో పెళ్లి చేయడానికి సిద్ధమైన సత్య.. రుక్మిణి మనోవేదన!

Published : Jun 04, 2022, 02:14 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 4 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Devatha: పిల్లల కోసం ఆదిత్యకు మూడో పెళ్లి చేయడానికి సిద్ధమైన సత్య.. రుక్మిణి మనోవేదన!

ఎపిసోడ్ ప్రారంభంలోనే ఈశ్వర్ ప్రసాద్ అక్క ఇంట్లో అందరిపై డిమాండ్ చేస్తూ కనిపిస్తుంది. ఇక సత్యను పిల్లలు కనిపించడం లేదు అని అనటంతో దేవుడమ్మ (Devudamma) నిజం చెప్పేస్తుంది. తనకు పిల్లలు పుట్టరు అని చెప్పడంతో వెంటనే ఆవిడ తనకు పిల్లలు పుట్టకపోతే ఏంటి ఆదిత్యకు (Adithya) పిల్లలు పుడతారు కదా అని అంటుంది.
 

27

అంతే కాకుండా ఆదిత్యకు (Adithya) మరో పెళ్లి చేయమని ఆ పెళ్లిని కూడా సత్య తో ఆదిత్యను ఒప్పించమని అంటుంది. దాంతో సత్య ఆమె మాటలకు భయపడి సరే అంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయానికి సత్య తో పాటు ఇంట్లో వాళ్లంతా బాధపడుతూ ఉంటారు. ఇక ఓవైపు ఆడుకుంటున్న చిన్నయి (Chinmai) ని చూసి దేవి బాధపడుతుంది.
 

37

తన అమ్మ రాధ (Radha) కాదని పొరపాటుపడినప్పుడు ఆ బాధను తట్టుకోలేదు అని.. మరి చిన్మయికి తన తల్లి ఈ అమ్మ కాదు అని తెలిస్తే అసలు తట్టుకోగలదా అని ఆలోచిస్తూ బాధపడుతుంది. ఇక చిన్మయి దగ్గరికి వెళ్లగా అక్కడ చిన్నయి ఇటుకలతో ఇల్లు కడుతూ ఉంటుంది. దేవి (Devi) ఇల్లు కట్టడానికి ఇటుకలతో పాటు సిమెంట్, రాళ్లు కూడా ఉండాలి అని సలహాలు ఇస్తూ ఉంటుంది.
 

47

అంతలోనే చిన్మయి (Chinmai) పై కొన్ని ఇటుకలు పడటంతో తన చేతికి గాయమవుతుంది. తన చేతికి రక్తం రావడంతో అది చూసి తట్టుకోలేక పోతుంది దేవి (Devi). వెంటనే తన చేతిని తన నోట్లో పెట్టుకొని దానికి కాస్త ఉపశమనం అందిస్తుంది. ఆ తర్వాత తనను ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది.
 

57

అదంతా రాధ (Radha) ఒకచోట నిల్చొని చూస్తుంది. వీరి ప్రేమలు చాలా బలంగా ఉన్నాయని అనుకుంటూ.. ఒకవేళ ఇంట్లో నుంచి దేవి (Devi) ని తీసుకొని బయటికి వెళ్ళాలి అంటే చిన్మయి ఒంటరి అయిపోతాది అని బాధపడుతుంది. తన పరిస్థితులు అర్థం కాకుండా ఉన్నాయి అని కుమిలిపోతుంది.
 

67

ఇక ఆదిత్య (Adithya) ఆఫీసు నుంచి రాగానే సత్య ఆదిత్య దగ్గరికి వెళ్లి నిన్ను ఒక విషయం అడుగుతాను అని. కాదనకూడదు అని ప్రమాణం చేయమని అంటుంది. ఆదిత్య ప్రమాణం చేస్తూ ఉండగా అప్పుడే ఫోన్ రావటంతో ఆదిత్య ప్రమాణం చేయలేకపోతాడు. ఇక సత్య (Satya) ప్రమాణం చేయమని అనడంతో ఆదిత్య ప్రమాణం చేయకుండా నీ మాటకు విలువ ఇస్తా కదా అని అంటాడు.
 

77

దాంతో ఆదిత్యతో సత్య (Satya) ఇంట్లో వారసత్వం కోసం మరో పెళ్లి చేసుకోమని అంటుంది. ఆ మాటకు ఆదిత్య షాక్ అవుతాడు. మన ఇద్దరి కోసం కాకుండా ఇంట్లో వాళ్ళ కోసం అయినా పెళ్లి చేసుకోవాలి అనటంతో ఆదిత్య (Adithya) తనపై కోప్పడతాడు. ఆ విషయాల గురించి నువ్వు ఆలోచించకూడదు అని తనకు సరిదిద్ది చెప్పి బయటికి వెళ్తాడు.

click me!

Recommended Stories