నిన్న ఎదురుచూస్తున్నానంటూ.. ఈరోజేమో సిగ్గేస్తోందంటూ.. ఈషా రెబ్బా పోస్టులు ఎవరికోసం..

First Published | Jul 7, 2023, 6:59 PM IST

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba)  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మాత్రం ఈ ముద్దుగుమ్మ పోస్టులు ఇంట్రెస్టింగ్ గా మారాయి.
 

యంగ్ బ్యూటీ ఈషా రెడ్డి ప్రస్తుతం  వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంటున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడిప్పుడు కాస్తా ఆఫర్లు అందుతున్నాయి. తర్వలో రెండు చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. 
 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మరింత సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ నెట్టింట స్టన్నింగ్ అవుట్ ఫిట్లతో అదరగొట్టిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తూ మరింతగా క్రేజ్ దక్కించుకుంది.
 


ఇక తాజాగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. గ్రీన్ హాఫ్ శారీలో బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చి  ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. క్యూట్ గా ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. సిగ్గుపడుతూ, కొంటెగా చూస్తూ చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

అయితే ఈషా రెబ్బా పోస్టులు ప్రస్తుతం వైరల్ గా మారాయి. రెండ్రోజులుగా ఈ ముద్దుగుమ్మ ఫొటోలను పోస్టు చేస్తూ ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్స్ ఇస్తూ అందరి చూపు తనపై పడేలా చేస్తోంది. తన క్యాప్షన్లు చూస్తే ఒకవేళ ప్రేమలో పడిందా? అనే సందేహం రాక తప్పదు. 
 

నిన్న కొన్ని ఫొటోలను పంచుకుంటూ ‘ఎదురుచూస్తున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అది ఎవరి కోసం అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెను ప్రశ్నించారు. ఇక ఈరోజు కూడా మళ్లీ మరిన్ని ఫొటోలను పంచుకుంటూ ‘నా హృదయం సిగ్గుపడుతోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ ఎవరి కోసం ఇలా పోస్టులు పెడుతోందనేది ఆసక్తికరంగా మారింది. 
 

ఇదిలా ఉంటే.. ఈషా రెబ్బా మళ్లీ తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నారు. నైట్రో స్టార్ సుధీర్ బాబు సరసన ‘మామ మాశ్చీంద్ర’, జేడీ చక్రవర్తి ‘దయా’ అనే బెసిరీస్ లో నటిస్తున్నారు. 

Latest Videos

click me!