ఈషా రెబ్బా చివరికి వేశ్యగా మారుతుందా?.. అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..

First Published | Jan 18, 2021, 7:44 PM IST

తెలుగు అందం ఈషా రెబ్బకి సరైనా  ఆఫర్స్ రావడం లేదు. మెయిన్‌ స్ట్రీమ్‌ హీరోయిన్‌గా రాణించే సత్తా ఉన్న ఈ బ్యూటీకి ఆ రేంజ్‌లో సపోర్ట్ దక్కడం లేదు. దీంతో అరాకోర ఆఫర్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా ఈ హాట్‌ బ్యూటీ వేశ్యగా మారబోతుంది. కాల్‌ గర్ల్ గా విభిన్న కోణాలను ఆవిష్కరించబోతుందట. 

తెలుగమ్మాయి ఈషా రెబ్బా కాల్‌ గర్ల్ గా కనిపించబోతుందట. అయితే ఓ వెబ్‌ సిరీస్‌ కోసం తాను వేశ్యగా మారబోతుందని తెలుస్తుంది.
దర్శకుడు వెంకీ కుడుముల వద్ద పనిచేసిన వినయ్‌ అనే అసిస్టెంట్‌ దర్శకుడిగా మారబోతున్నారు. ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించనున్నారు. మెట్రో సిటీ బ్యాక్‌ డ్రాప్‌లో ఓ వేశ్య కథతో ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందించనున్నారట.

ఇందులో ఓ కాల్‌ గర్ల్ జీవితాన్ని మూడు దశల్లో ఆవిష్కరించనున్నారని, ఈ మూడు దశలో ఆ అమ్మాయి లైఫ్‌ ఎలా సాగుతుంది, ఆమెలో వచ్చిన మార్పేంటి వంటి వాటిని చూపించబోతున్నారట.
ఈ వెబ్‌ సిరీస్‌లో వేశ్యగా ఈషా రెబ్బాని తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇందులో ఈషా రెబ్బా అందాల ఆరబోత చేయబోతుందని, దాదాపు సెమీ న్యూడ్‌గా కనిపించబోతుందని టాక్.
ఇదే నిజమైతే, ఈషా రెబ్బా ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో అత్యంత బోల్డ్ రోల్‌ ఇదే అవుతుందని చెప్పొచ్చు.
తాను గ్లామర్‌ పాత్రలు కూడా చేస్తానని, అందుకు సిద్ధంగానే ఉన్నానని పలు ఇంటర్వ్యూలో చెప్పింది ఈషా రెబ్బా. ఇన్నాళ్లకు అలాంటి పాత్ర దక్కడం విశేషం.
ఇది సినిమా అయితే దాని రేంజ్‌ వేరే ఉండేది, కానీ వెబ్‌ సిరీస్‌ కావడంతో దానికి రావాల్సిన గుర్తింపు వస్తుందా? అన్నది సస్పెన్స్ నెలకొంది.
ఇటీవల మంచి కంటెంట్‌ ఉన్న వెబ్‌ సిరీస్‌లు బాగా ఆదరణ పొందుతున్నాయి. వీటి ద్వారా చాలా మంది నటీనటులు మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాల్లోకి వస్తున్నారు. మరి ఈషాకి ఎలాంటి పేరుని, క్రేజ్‌ని తీసుకొస్తుందో చూడాలి. ఫస్ట్ ఇందులో ఈషా నటిస్తుందా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు ఈషా రెబ్బా ప్రస్తుతం `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు తమిళంలో `ఆయిరామ్‌ జెన్మంగల్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `లస్ట్ స్టోరీస్‌` వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో ఓ పార్ట్ లో ఈషా నటిస్తుంది. ఇందులో కూడా ఆమెది బోల్డ్ రోల్‌ కావడం విశేషం.

Latest Videos

click me!