టాలీవుడ్ లో దర్శకుడు క్రిష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే... తాజాగా క్రిష్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా నిలిచారు. మొత్తం తొమ్మిది మంది ఉండగా అందులో క్రిష్ ఒకరు..
క్రిష్ ను విచారణకు కావాలని కూడా పోలీసులు సూచించారు. ఇదిలా ఉంటే.. క్రిష్ గురించిన కొన్ని విషయాలు ప్రస్తుతం మళ్లీ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన డివోర్స్ మేటర్ తెరపైకి వచ్చింది.
పెళ్లైనా రెండేళ్లకే క్రిష్ విడిపోవడానికి కారణం ఏంటంటూ ఆలోచిస్తున్నారు. 2016లో రమ్య అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్న క్రిష్ 2018లోనే డివోర్స్ తీసుకున్నారు. అందుకు కారణం కూడా ఆసక్తికరంగా మారింది.
అయితే, కంచె సినిమా తర్వాత క్రిష్ ఆ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఉన్నాయి. అదే సమయంలో ఆయనకు పెళ్లి అయ్యింది. మ్యారేజ్ తర్వాత కూడా ఆ రిలేషన్ అలాగే కొనసాగడం.. ఆ విషయం అతని భార్యకు తెలియడంతో డివోర్స్ ఇచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ డ్రగ్స్ కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.